Home రాష్ట్ర వార్తలు ఐసిస్ ఉగ్రవాదులు నరక లోకపు కుక్కలు

ఐసిస్ ఉగ్రవాదులు నరక లోకపు కుక్కలు

వారి వలలో పడొద్దు : అసదుద్దీన్
Asaduddin-Owaisiమన తెలంగాణ / హైదరాబాద్ : ఐసిస్ ఉగ్రవాదులు నరక లోకపు కుక్కలు అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసి తీవ్రస్థాయిలో విమ ర్శించారు. భారతీయ ముస్లింలు ఆయుధాలతో కాకుం డా ప్రజాస్వామ్యబద్ధంగా జిహాద్ చేయాలని పేర్కొ న్నారు. ఐసిస్ సిద్ధాంతాన్ని, చర్యలను ఖండిస్తూ మజ్లిస్ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో శుక్రవారం రాత్రి ఎంఐఎం భారీ బహిరంగ సభ నిర్వహించింది. వివిధ ముస్లిం తెగలకు చెందిన మత పెద్దలు, పండితులు హాజ రయ్యారు. ఐసిస్ ఇస్లాంకు శతృవు అని, దానిని నిర్మూ లించాలని వారు పిలుపునిచ్చారు. సభలో అసదుద్దీన్ ఓవైసి మాట్లాడుతూ ‘ఐసిస్ మనలోనే ఉంది. ఇస్లాంతో ఐసిస్‌కు సంబంధం లేదనడంలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఆ సంస్థకు చెందిన వారు మనలోనే ఉన్నా రు. కాబట్టి దానిని నిర్మూలించడం మన బాధ్యత’ అని స్పష్టం చేశారు. ఐసిస్‌ది నేరస్థుల సైన్యమని, వారంతా నరకలోకపు కుక్కలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముస్లింలకు పవిత్రమైన మహ్మద్ ప్రవక్త సమాధి ఉన్న మదీనాకు ఎవరైనా ఆత్మాహుతి సభ్యుడిని పంపుతారా? అని ఐసిస్ అధినేత అబూ బాకర్ అల్ బగ్దాదీని ప్రశ్నిం చారు. ‘బగ్దాదీ నువ్వు నిజమైన ముస్లిం ముందుకు వస్తే మేమే నిన్ను వంద ముక్కలుగా నరకడం ఖాయం. నువ్వు అమాయకులను చంపుతున్నావు. నువ్వు పట్టు బడిన రోజున నీ అనుచరులకు నీ బొక్కలు దొరకవు. ముస్లింలకు నువ్వు తెచ్చిన అంతులేని బాధను వర్ణిం చేందుకు పదాలు కూడా దొరకడం లేదు” అని మండి పడ్డారు. మదీనాపై ఐసిస్ దాడి చేయడమంటే వారి అంతానికి అదే ఆరంభమన్నారు. ఐసిస్ ఇస్లాంకు వ్యతి రేకమని, ముస్లింలు విభిన్న తెగలుగా విడిపోయి ఉండొ చ్చు కానీ ప్రవక్తను ప్రేమించే విషయంలో అందరూ ఒక్కటేనన్నారు. భారత్‌లోని 17 కోట్ల మంది ముస్లింల ను బిజెపి, భద్రతా సంస్థలు వేధించినట్లయితే అది ఐసిస్ కు సహాయం చేసినట్టే అవుతుందని ఓవైసి అన్నారు.
గూగుల్, వాట్సాప్‌లో ఇస్లాం దొరకదు
ఇటీవల ఇస్లాం సంబంధించిన సందేశాల కోసం యువత పెద్ద ఎత్తున గూగుల్, వాట్సాప్‌లపై ఆధార పడడాన్ని ప్రస్తావి స్తూ వాటిల్లో ఇస్లాం దొరకదని, ఆసక్తి ఉంటే ఇస్లాం పండితుల వద్దకు వెళ్ళాలని అసదుద్దీన్ సూచించారు. కంప్యూటర్, ఇంటర్నెట్‌లో ఐసిస్ గురించి వెతికే మూర్ఖపు పని చేయవద్దని, వాళ్ళ వలలో పడొద్దన్నారు. టెక్నాలజీ ఎంతో ముందుకు పోయిం దని, అలా ఐసిస్ అని టైప్‌చేసిన వెంటనే పోలీసులకు మీ గురించి తెలిసిపోతుందని, మిమ్మల్ని పోలీసులు, బిజెపి లక్షంగా చేసుకుంటారని హెచ్చరించారు.
బిజెపి, సంఘ్‌పై జిహాద్ చేయండి
ఐసిస్ పట్ల ముస్లిం యువకులు అప్రమత్తంగా ఉండా లని, జిహాద్ గురించి నూరిపోసి 19-20 ఏళ్ళ యువ కులను ఆత్మాహుతి దాడులకు పంపిస్తున్నారని ఓవైసి చెప్పారు. జిహాద్ చేయాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలే తప్ప ఆయుధాలతో కాదని హితవు పలికారు. మీ అతి పెద్ద ఆయుధం ఓటు అని చెప్పారు. నిజంగా జిహాద్ చేయాలనిపిస్తే ముస్లింలు జీవిస్తున్న ప్రాంతాలకు వెళ్ళి వారి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలని సూచించారు. ఇంకా జిహాద్ చేయాలనిపిస్తే బిజెపి, సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడండి, అది కూడా జిహాదేనన్నారు.