Home అంతర్జాతీయ వార్తలు వారం రోజుల్లో ఐఎస్‌ఐఎస్‌ను లేకుండా చేస్తాం: ట్రంప్

వారం రోజుల్లో ఐఎస్‌ఐఎస్‌ను లేకుండా చేస్తాం: ట్రంప్

Donald-Trump

 

న్యూయార్క్: సిరియాలో వారం రోజులలో ఐసిస్‌ని లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటి వరకు ఐసిస్‌ను 80 శాతం వరకు అంతం చేశామని ప్రకటించారు. సిరియాలో తీవ్రవాదులు గుప్పిట్లో ఉన్న 20 వేల  చదరుపు మైళ్ల భూమిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మాసూల్- రక్కా ప్రాంతాలలో ఐసిస్ కు సంబంధించిన 60 మంది లీడర్లను మట్టుబెట్టామని పేర్కొన్నారు. అమెరికా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు పది వేల మంది తీవ్రవాదులు చనిపోయి ఉంటారని సమాచారం.  ఐసిస్‌కు ఉన్న మిగిలిన స్థావరాలపై కూడా దాడి చేసి అంతం చేస్తామని వెల్లడించారు. సిరియన్ డెమోక్రాటిక్ బలగాలతో అమెరికార సైన్యం కలిసి సిరియా, ఇరాక్‌లో ఉగ్రవాదులను లేకుండా అంతం చేశామని గొప్పగా చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అమెరికా కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

 

ISIS will Close within Week in Syria: Donald Trump