Home అంతర్జాతీయ వార్తలు అల్ బగ్దాది తనయుడు హతం…

అల్ బగ్దాది తనయుడు హతం…

islamic-badri

ఇడ్లిబ్: ఇస్లామిక్ స్టేట్ నేత అబు బకర్ అల్ బగ్దాది కొడుకు హుతైఫా అల్ బద్రి హతమైనట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇస్లామిక్ స్టేట్స్ కి చెందిన సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. దీంట్లో ఓ చిన్న కుర్రాడు గన్ పట్టుకున్ని ఉన్న ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది.  హోమ్స్ ప్రావిన్సులో సిరియా, రష్యా దళాలతో జరిగిన పోరులో చనిపోయినట్టు ఆ ప్రకటనలో వెల్లడించింది. అతను ఎప్పుడు హతమయ్యాడో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. జూన్ మొదటి వారంలో జరిగిన వైమానిక దాడుల్లో ఈ సంఘటన జరిగి ఉంటుందని అంచనా. ఐఎస్ చీఫ్ అల్ బగ్దాది మృతిచెందినట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అతను ఇంకా బ్రతికే ఉన్నాడని పుకార్లు కూడా వస్తున్నాయి. అయితే బగ్దాది భార్య, కూతురిని 2014లో లెబనాన్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.