Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

జీవాల ఆకృతిలో దీవులు

Island

దీవి అంటేనే అక్కడి ప్రదేశం చూడటానికి ముచ్చటగా ఉంటుంది. చుట్టూ నీరు మధ్యలో భూమి ఎంతో బావుంటుంది. పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి దీవుల ఆకారాలు జంతువుల ఆకారంలో ఉంటే ఇంకా విచిత్రం. అలాగ తాబేలు దీవి, నీటిగుర్రం దీవి, డాల్ఫిన్ దీవి ఉన్నాయి. తాబేలు దీవి తైవాన్ దేశంలో ఉంది. దీనికి ఆనుకుని ఉన్న పసిఫిక్ తీరం ఉంటుంది. దీని పేరు గ్యుషన్ ఐలాండ్. స్టీప్ ఐలాండ్, టర్టెల్ ఐలాండ్ అనీ ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. పర్యావరణ హితం కోరుతూ పర్యాటకులను ఎవరినీ ఇప్పుడు అనుమతించటం లేదు.

ఈక్వెడార్‌లో తీరంలో గాలాపాగోస్ దీవుల సమూహంలో నీటి గుర్రం ద్వీపం ఉంటుంది. పసిఫిక్ మహా సముద్రంలో అగ్నిపర్వత పేలుడు వల్ల ఏర్పడ్డ దీవులు. దీనిలో ఉన్న సీహార్స్ దీవి ఉంది. ఇది పెద్దగానే ఉంటుంది. శాటిలైట్ వ్యూలో చూసినప్పుడు స్పష్టంగా దీని ఆకారం కనపడుతుంది.

డాల్ఫిన్ దీవి దక్షిణ ఇటలీ లో ఉంటుంది. ఈ దీవి చుట్టూ నీరు స్వచ్ఛంగా నీలి రంగులో ఉండి, సున్నపు రాతితో ఈ దీవి ఏర్పడి ఉంటుంది. దీనిలో పార్కులు, గెస్ట్‌హౌస్‌లు, రిసార్టులు ఉంటాయి. బోట్లద్వారా ఈ దీవికి పర్యాటకులు చేరుకుంటారు.

Comments

comments