Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

2022లో మానవసహిత ఉపగ్రహం

16 నిమిషాల్లో అంతరిక్షం చేరనున్న ముగ్గురు వ్యోమగాములు. తిరుగు ప్రయాణానికి 36 నిమిషాలు, తొలిసారి ప్రయోగం చేపడుతున్న ఇస్రో

Rocket

న్యూఢిల్లీ : ముగ్గురు భారతీయ వ్యోమగాములతో కూడిన ఉపగ్రహాన్ని 2022లో అంతరిక్షంలోకి పంపుతామని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు. 16 నిమిషాల్లోనే రాకెట్ నిర్దేశించిన కక్షకి చేరుతుందని , దీనిని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తామని ఆయన చెప్పారు. అంతరిక్షంలో వ్యోమగాములు ఐదు నుంచి ఏడు రోజులు తక్కువ ఎత్తులోని కక్షలో గడుపుతారని తెలిపారు. ఆ తరువాత వ్యోమగాములున్న మాడ్యూల్ గుజరాత్ కోస్తా ప్రాంతంలోని అరేబియా సముంద్రంలో దిగుతుందని ఆయన చెప్పారు. ఈ గగన యాత్రని ఇస్రో చేపడుతుందని, దీనికి స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో 2022ని గడువుగా పెట్టారని శివన్ తెలిపారు. ఇస్రో చేపట్టనున్న్న ఈ మిషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన ఢిల్లీలో ఆటమిక్ ఎనర్జీ అండ్ స్పేస్ మంత్రి జితేంద్ర సింగ్‌తోపాటు ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. వ్యోమగాములను తీసుకుపోయే ఒక నౌక, దానికి అనుసంధానించిన సహాయక మాడ్యూల్ కలిసి అంతరిక్ష కక్షలో పని చేస్తాయని ఆయన వెల్లడించారు.

ఈ మాడ్యూల్ ముగ్గురు భారతీయ వ్యోమగాములను తీసుకుపోతుందని, ఇది అత్యంత ఆధునీకరించిన జిఎస్‌ఎల్‌వి ఎంకె 111 రాకెట్ సాంకేతికతని జోడించినదని ఆయన తెలిపారు. ఈ రాకెట్‌ని శ్రీహరికోట నుంచి ప్రయోగించినప్పుడు వ్యోమగాములను భూమికి 300 నుంచి 400 కిలో మీటర్ల ఎత్తులోని కక్షలోకి తీసుకెళ్తుందని, దీనికి కేవలం 16 నిమిషాల సమయం పడుతుందని ఆయన చెప్పారు. అంతరిక్ష కక్షలో వ్యోమగాములు 5 నుంచి 7 రోజులపాటు ఉంటారని ఆయన తెలిపారు. అక్కడ సూక్ష్మ గురుత్వాకర్షణతోపాటు మరిన్ని అంశాలపై శాస్త్రీయ పరిశోధనలు చేస్తారని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు.
గుజరాత్
వ్యోమగాములు కలిగి ఉన్న మాడ్యూల్ తిరుగు ప్రయాణంలో తనకు తానే దిశని మార్చుకుంటుందని శివన్ తెలిపారు. తిరుగు ప్రయాణంలో భూమికి 120 కిలో మీటర్ల ఎత్తుకు చేరుకోగానే వ్యోమగాముల మాడ్యూల్ నుంచి సర్వీస్ మాడ్యూల్ వేరవుతుందని చెప్పారు. అక్కడి నుంచి మానవ మాడ్యూల్‌లో ఏర్పాటు చేసిన ఏరోబ్రేక్‌ని ఉపయోగించి భూమికి వచ్చే వేగాన్ని తగ్గిస్తుందని, ఈ మాడ్యూల్ గుజరాత్ కోస్తాకు దగ్గరలోని అరేబియా సముద్రంలో పడిపోయేముందు వ్యోమగాములు పారాచ్యూట్స్ తెరుచుకుంటాయని ఆయన వివరించారు. ఈ తిరుగు ప్రయాణానికి 36 నిమిషాల సమ యం పడుతుందని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు. మాడ్యూల్ భూమికి తిరిగి వస్తున్న సమయంలో ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే, దానిలో ఏర్పాటు చేసిన బ్యాక్‌అప్ ప్లాన్ ప్రకారం బంగాళాఖాతంలో దిగుతుందని చెప్పారు.
మాడ్యూల్ బంగాళా ఖాతంలో దిగిన తరువాత 20 నిమిషాలో ్ల వ్యోమగాములు దాని నుంచి సురక్షితంగా బయటకు వస్తారని శివన్ తెలిపారు. వ్యోమగాముల మాడ్యూల్ 3.5 మెట్రిక్ డయా మీటర్లు ఉంటుందని, మాడ్యూల్ మొత్తం బరువు 7 టన్నులుంటుందని ఆయన వివరించారు.

ముందుగా రహిత అంతరిక్ష నౌక

అంతరిక్షంలోకి 2022లో మానవ సహిత నౌకని పంపడానికి ముందు 30 నెలల్లోపే మానవ రహిత పరీక్షా రాకెట్‌ని ప్రయోగిస్తామని చెప్పారు. ఇంకా పేరు నిర్ధారించని రెండవ మానవరహిత ప్రయోగం 36 నెలల్లోనే ఉంటుందని ఆయన చెప్పారు. ఇక మానవసహిత అంతరిక్ష రాకెట్ ప్రయోగం 40 నెలల్లో చేపడతామని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు. ఈ మిషన్‌కి అవసరమైన సం క్లిష్ట సాంకేతికాలను ఇప్పటికే దాదాపుగా అభివృద్ధి చేశామని, వ్యోమగాములు సురక్షితంగా బయట పడటానికి ఉపయోగపడే పాడ్ అబార్ట్‌ని తయారు చేశామని ఆయన చెప్పారు. అంతేకాకుండా వ్యోమగాముల మాడ్యూల్‌ని తయారు చేశామని శివన్ వివరించారు.

వీటిని పరీక్షిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యోమగాముల శిక్షణ చేపట్టడానికి వారు ధరించే సూట్‌ని తయారు చేశామని ఆయన తెలిపారు. శిక్షణ పొందడానికి వారిని బెంగళూరు పంపుతామని, అంతేకాకుండా విదేశాలకు కూడా శిక్షణ కోసం పంపిస్తామని శిన్ తెలిపారు. తొలిసారి అంతరిక్ష ప్రయాణం చేసిన భారతీయుడైన రాకేష్ శర్మతో సంబంధాలు నెరుపుతున్నామని, ఈ మిషన్‌లో అతని సహాయాన్ని తీసుకుంటున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కె శివన్ ఢిల్లీలో ఆటమిక్ ఎనర్జీ, స్పేస్ మంత్రి జితేంద్ర ప్రసాద్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించారు.

Comments

comments