Search
Friday 16 November 2018
  • :
  • :

మహాబల భళీ

జిఎస్‌ఎల్‌వి మార్క్-౩ ఘన విజయం, ఫలించిన 18 ఏళ్ల ఇస్రో కృషి 

సొంత క్రయోజెనిక్ ఇంజిన్‌తో భూకక్షలోకి అతి బరువైన ఉపగ్రహ ప్రయోగం

ఇతోధిక ఇంటర్నెట్ స్పీడ్

ఐదు పెద్ద దేశాల సరసన ఇండియా, ప్రముఖుల అభినందనల పరంపర

ISRO

న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త చరి త్రను సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత బరువైన జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి 1 రాకెట్ ను శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుండి ఇస్రో సోమవారం సాయంత్రం విజయవంతంగా రోదసిలో కి పంపింది. ఈ భారీ రాకెట్ ప్రయోగానంతరం ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1/జిశాట్-19 మిషన్ ప్రయోగం విజయవంతమైందని ఆయన ప్రకటించారు. జిశాట్-19ని మోసుకెళ్లే జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 రాకెట్ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ కేంద్రం నుండి  సాయంత్రం 5.28 గంటలకు ప్రయోగించామని ఆయన చెప్పారు. క్రయోజెనిక్ ఇంజిన్‌తో కూడిన ఈ వాహకనౌక ప్ర యోగించిన 16 నిమిషాల్లోనే జిశాట్-19 ఉపగ్రహా న్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ రాకెట్‌కు ఉద్దేశించిన కౌంట్‌డౌన్ ఆదివారం మధ్యాహ్నం 3.58 గంటలకు ప్రారంభమయింది. 25 గంటల 30 నిమిషాల సుదీర్ఘ కౌంట్‌డౌన్ తర్వాత ఇది అంతరిక్షంలోకి నిప్పులు చిమ్ముతూ దూసు కెళ్లింది. 640 టన్నుల బరువు, 43.43  మీటర్ల పొడ వున్న ఈ రాకెట్‌కు సుమారు 4 వేల కేజీల పేలోడ్‌ను జియోసింక్రనస్ ట్రాన్సఫర్ ఆర్బిట్ (జిటిఒ)లోకి, మరో 1000 కేజీల లోడ్‌నులో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఇఒ) లోకి ప్రవేశపెట్టే సామర్థముంది. ఈ మిషన్ విజయ వంతమవడం వల్ల భారత్ ఇకపై నాలుగు టన్నుల బరువున్న శాటిలైట్‌ల ప్రయోగాలకు భారీ మొత్తాల ను చెల్లించి విదేశీ రాకెట్లపై ఆధారపడనక్కర్లేదు. తనే సొంతంగా ప్రయోగించుకోనుంది. ఈ రాకెట్‌లో ఉప యోగించిన అతిపెద్ద క్రయోజెనిక్ ఇంజిన్‌ని ఇస్రో శాస్త్రవేత్తలే తయారు చేశారు. పదేళ్ల పాటు సేవలందించనున్న జిశాట్-19 ఒక బహుళ పుంజ శాటిలైట్.
దేశం గర్వించదగ్గ విజయం : రాష్ట్రపతి
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 రాకెట్ ప్రయోగం విజయవంతమవడం దేశం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇది చారిత్రక విజయంగా ఆయన అభివ ర్ణించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘భారీ శాటి లైట్లను మోసుకెళ్లగలిగే విధంగా భారత్ తయారు చేసిన బాహుబలి రాకెట్ జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 ప్రయోగం విజయవంతమవడం దేశం గర్విం చదగ్గ విషయం’ అని ఇస్రో ఎఎస్ కిరణ్ కుమార్‌కి రాష్ట్రపతి ఒక సందేశం పంపారు.
ఇస్రోకి ప్రధాని మోడీ, సోనియా అభినందనలు
ఈ భారీ రాకెట్ విజయంతో తదుపరి తరం ఉపగ్రహ సామర్థానికి భారత్ మరింత చేరువయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మిషన్ విజయ వంతమవడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. జిఎస్‌ఎ ల్‌వి మార్క్-3 డి1 ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే మోడీ శాస్త్రవేత్తలను ద్వారా అభినందించారు. అంతరిక్ష శాఖ కార్యదర్శితో మోడీ మాట్లా డారని, ఆయనతో పాటు ఈ ప్రయోగంలో పాల్గొన్న ఆయన బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారని ప్రధాని కార్యాలయం (పిఎంఒ) ఒక ప్రక టనలో తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది జాతి గర్వించదగ్గ మరో గొప్ప విజయమని ఆమె పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో అద్భుత ప్రదర్శన సంప్రదాయాన్ని నిలిపిందని ఆమె ప్రశంసించారు.

Comments

comments