Home నల్లగొండ ఆత్మహత్యలకు కేరాఫ్ తెలంగాణ

ఆత్మహత్యలకు కేరాఫ్ తెలంగాణ

cpi-ravindara-naik-mla2మన తెలంగాణ/మిర్యాలగూడ టౌన్: రైతుల ఆత్మహత్యలుగా తెలంగాణ రాష్ట్రం మారిందని, ఆత్మ హత్యలను నివారించడంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు శూన్యమని దేవరకొండ శాసనసభ్యులు ధీరావత్ రవీంద్రకుమార్ ఆరోపించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ సేద్యం కోసం తెచ్చిన అప్పులు పెరిగి గత్యంతరం లేక రైతులు పిట్టల్లా రాలుతున్నా సర్కార్‌లో చలనం లేదన్నారు. తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి,అఖిలపక్ష నాయకులతో చర్చించి ఆత్మహత్యల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఇప్పటికే 1300లకు పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దేశంలో ఆత్మహత్యలలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచిం దన్నారు. వడ్డీవ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేయగా, ప్రకృతి సహక రించకపోవడంతో దిక్కు తోచనిస్థితిలో పురుగుల మందులు తాగుతున్నారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అందుకుగల కారణాలను అన్వేషించి పరిష్కారమార్గం చూపాలన్నారు. కేంద్రానికి కరువు నివేదిక పంపించి ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.