Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జిఎస్‌టి బిల్లు ఆమోదించి తీరుతాం

Arun_Jaitley2కొల్లాం : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధక రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకుండా అడ్డుకుంటోందన్నారు. కానీ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కీలకంగా మారిన ఈ బిల్లును ఆమోదించి తీరుతామని ఆయన స్పష్టంచేశారు. కేరళలోని కొల్లాంలో అమృతానందమయి మఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనం తరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, కానీ ఎన్‌డిఎ ప్రభుత్వం విజయపథంలో పయనిస్తుండడంతో దానిని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పలు ఆర్థికవ్యవస్థలు సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆ పరిస్థితులను తట్టుకొని ఎదిగే సత్తా భారత్‌కు ఉందన్నారు. భారత్ అభివృద్ధి సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారని, కానీ దురదృష్టవశా త్తూ కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. బీహార్‌లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నకు ఆ ప్రక్రియ సాఫీగా సాగుతోందన్నారు. స్వచ్ఛభారత్‌పై మాట్లాడుతూ, కంపెనీలు, ఎన్‌ఆర్‌ఐలు సమాజంలోని సహా భిన్నవర్గాల ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి ఇతోధిక సాయం చేస్తున్నారన్నారు. మొదటిదశలో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.

Comments

comments