Home ఎడిటోరియల్ ప్రకృతి కన్నెర్ర చేస్తోంది

ప్రకృతి కన్నెర్ర చేస్తోంది

 Issues and Priorities for Agriculture

గత కొన్ని వారాలుగా మన దేశంలో ఉష్ణతాపం గణనీయంగా పెరిగిపోయింది. వర్షపాతం అనూహ్యంగా వాతావరణ శాఖ అంచనాలకు భిన్నం గా తగ్గిపోయింది. ప్రజలు వర్షాకాలం కూడా ఎండా కాలాన్ని తలపించడంతో ప్రజలు ఎండలు భరించలేక మలమల మాడిపోతున్నారు. భూ ఉష్ణోగ్రత 1.5 సెల్సియస్ డిగ్రీలకు మించకూడడని పర్యావరణ శాశ్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నా వాటిని పెడచెవిన పెట్టడం ఈ భూతాపానికి ప్రధాన కారణం.
వారావరణ అసమతుల్యతకు అధి క భాగం మానవ తప్పిదమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రకృతి సమతుల్యానికి కావల్సిన అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఉష్ణతాపం పరిధులకు మించి పెరిగిపోతోంది. అడవుల నరికివేత, ఆకాశహర్మ్యాల నిర్మా ణం, మైదానప్రాంతాలలో చెట్లులేకపోవడం, అభివృద్ధి పేరిట ఉన్న చెట్లను నరికివేయడం, పరిశ్రమల, వాహన కాలుష్యం ప్రకృతి అసమతుల్యానికి కారణమౌతోంది. మానవుడు అభివృద్ధి పేరిట ప్రకృతిని సవాలు చేస్తే, దానికి ప్రతిగా ప్రకృతి కన్నెర్ర చేస్తే పరిణామాలు ఏ విధంగా వుంటాయో ప్రస్తుత పరిస్థితులను చేస్తే అర్ధం చేసుకోవచ్చు.
బహుళ అంతస్థులు నిర్మించి వాటి లో ప్రజల నీటి అవసరాల కోసం భూమిని ఇష్టారాజ్యంగా తవ్వి ఒక బోరు సరిపోకపోతే అదనంగా అదే ప్రాంగణంలో మరి రెండు బోర్లు జోడిస్తూ భూగర్భ జల సమతుల్యతని అస్తవ్యస్తం చేయడం ఎంతవరకు సబబో మానవులు ఆలోచించుకోవాలి. అభివృద్ధి పేరిట హరిత దనాన్ని హరియించి, తన ఉనికికే ముప్పు తెచ్చుకోవడం కూర్చున్న కొమ్మను నరుకున్న చందమని ఇప్పటికైనా తెలుసుకోవడం మంచిది.
వాతావరణంలో సున్నితత్వం లో పించడం, కార్బన ఉద్ఘారాల తీవ్రత పెరిగిపోయి, 80 కోట్ల ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా దిద్దుబాటు చర్యలు కొరవడడం బాధాకరం. ఈ ఉష్ణ తీవ్రతతో 1997-2017 మధ్య కాలంలో సముద్ర మ ట్టాలు అనూహ్యం గా 3.3 మిల్లీమీటర్లు పెరిగినందువలన వరదలు, సునామీలు సంభవించి సముద్ర జలాలు ప్రపంచవ్యాప్తంగా జనవాసాలలోనికి చొచ్చుకురావడం, మంచు ఖండాలు కరుగుతుండడం, అందువలన జీవ నదులు ఎండిపోయి, పంటలకు సేద్యపు నీరు, ప్రజలకు త్రాగు నీరు లభించడం దుర్లభమవుతోంది. మేఘాల కదలికలు లేకపోవడంతో హఠాత్తుగా కారు మేఘాలు ఒక్కసారిగా కమ్ముకువచ్చి కుంభవృష్టి( క్లౌడ్ బరస్ట్) కురిపించడం, పెను తుఫాన్లు విరుచుకుపడి, జన, ధన, ఆస్తి నష్టం సంభవించడం సర్వసాధారణం అవుతోంది.
వ్యవసాయ ప్రధానం అయిన మన దేశంలో ఈ ముప్పు తీవ్రం గా వుండడంతో వ్యవసాయ రంగంపై జీవిస్తున్న కోట్లాది ప్రజలు, ఈ రంగాన్ని త్యజించి, పట్టణాలకు వలస కూలీలుగా వలస వెళ్ళడం దేశంలో నెలకొంటున్న ఒక సామాజిక సమస్యకు దర్ప ణం పడుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ అధ్యయన నివేదిక ప్రకారం మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు గత దసాబ్ద కాలంలో 21 శాతం తగ్గిపోయాయని, దిద్దుబాటు చర్యలు లేకపోతే చిన్నచిన్న ఆహార ఉత్పత్తుల కోసం కూడా ఇతర దేశాల నుండి దిగుమతుల కోసం ఆధారపడే దుస్థితి సంభవించనున్నదని సదరు నివేదిక హెచ్చరిస్తోంది. ఇటీవలి కాలం లో ప్రజలు, ప్రజా రవాణా వ్యవస్థను మరిచి, ప్రతి కుటుం బ సభ్యునికొక వాహనం చొప్పున సమకూర్చుకుంటుండడం తో వాతావరణ కాలుష్యం పెంచడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పాలకులు కూడా ఈ పెను సమస్యపట్ల ఎటువంటి అవగాహన లేక, పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రజల జీవితాలను గాలిలో దీపం చందాన వుంచడంపై అందరూ సమాలోచన చేయాలి.

 Issues and Priorities for Agriculture

Telangana News