Home కుమ్రం భీం ఆసిఫాబాద్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

old

మన తెలంగాణ/ఆసిఫాబాద్: ప్రజా ఫిర్యాదు ల్లో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించా లని కలెక్టర్ చంపాలాల్ అన్నారు. సోమవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుకు వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల్లో వచ్చిన సమస్యలను సంబంధిత అధికా రులు త్వరగా పరిష్కరించాలని, అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పు కోకూడదన్నారు. సమస్యలపై అలసత్వం వహించిన అధికా రులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ ఫిర్యాదు విభాగంలో రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రామయ్య కల్యాణలక్ష్మి పథకంకోసం గత మూడు నెలల క్రితం దర ఖాస్తు చేసుకున్నానని ఇప్పటి వరకు డబ్బులు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. అదే మండల పోతెపల్లి గ్రామానికి చెందిన అమృత తన భూమి చెరువు నిర్మాణంలో పోయిందని  నష్టపరిహారం ఇవ్వాలని, ఆసిఫాబాద్ మండ లం జన్కాపూర్‌కు చెందిన రాజుబాయి అపూ వితంతు పెన్షన్‌కోసం, కాగజ్‌నగర్‌కు చెందిన సురేంద్రనాథ్ బ్యాంకు రుణం కోసం, రెబ్బెన మండలానికి చెందిన సోమయ్య వృధ్దాప్య పింఛన్ కోసం, పెంచికల్‌పేట్ మండలానికి చెందిన ఆదివాసి నాయకులు మండల కేం ద్రంలో కొమురం భీం విగ్రహం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. ఈ ప్రజా ఫిర్యాదుల విభాగంలో 40కు పైగా దరఖాస్తు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలె క్టర్ అశోక్‌కుమార్, సిపిఓ కృష్ణయ్య, సంబంధి త జిల్లా అధికారులు పాల్గొన్నారు.