Search
Sunday 18 November 2018
  • :
  • :

మొరాయిస్తున్న ‘ధరణి’ వెబ్‌సైట్

 Issues that emerge in the Dharani website

మనతెలంగాణ/ రాజంపేట్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూప్రక్షాళనలో భాగంగా ప్రతి రైతు భూములను సరిచేసుకోవాలని ప్రభుత్వం ప్రక్రియను చేపట్టింది. అయితే దీంతో గ్రామాల్లోని రైతులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పాసుపుస్తకాలు చెక్కులను అందజేసింది. దీంతో కొంత మందికి పాస్‌పుస్తకాలు వచ్చిన వారికి చెక్కులు రాలేదు. చెక్కులు వచ్చిన వారికి పాస్‌పుస్తకాలు రాలేదు. దీంతో పాటు ఆధార్‌నంబర్ సరిగా లేకపోవడంతో పాస్‌పుస్తకం మీద ఫోటో మరొకరిది పడడంతో కొన్నింటిని సరిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయా పనుల్లో నిమగ్నమైన రెవెన్యూ సిబ్బందికి అంతలోనే ధరణి అనే వైబ్‌సెట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లో సరైనటువంటి ఆప్షన్లు లేక సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రక్షాళనలో వచ్చిన దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు అలాగే వివిధ రకాల సంబంధించిన సమస్యలను ధరణి వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రక్షాళన కార్యక్రమం డాటా కనెక్షన్ కోసం ఒక యాప్ ఇవ్వడం జరిగింది. అందులో ఎన్ని పాసుపుస్తకాలు పంచారు. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో దానిపైన ఒక యాప్ ఇవ్వడం జరిగింది. అందులో ఎలాంటి డిఫెక్ట్ ఇవ్వలేదు. డిలీట్ ఖాతా డిలీట్ సర్వే నంబర్ మిస్సింగ్ సర్వే నంబర్ అంటూ ఏమి లేకుండానే ఏదో ఒక దాంట్లో నమోదు చేయాలని చెప్పడంతో అధికారులు నమోదు చేశారు. ఇప్పుడు కరెక్షన్ వాటిల్లో రాకపోవడంతో డిజిటల్ సంతకం కోసం ఇబ్బందులు పడుతున్నారు. మాడ్యూల్ సరిగ్గా లేక ధరణిలో సైతం ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. ప్రారంభ దశలో ఇవ్వకుండా 4, 5 రోజులకు మాడ్యూల్ ఇవ్వడంతో పని ప్రారంభించారు. కొన్ని సరిచేయాలని చూసినా ఇప్పటికి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

కరెక్షన్ మాడ్యూల్ ఇచ్చి తప్పులు ఉన్నవి తప్పులుగా కరెక్టుగా ఉన్నవి కరెక్ట్ సరిచేయడం జరుగుతూనే ఉండేది. కానీ ధరణి వెబ్‌సైట్‌లో డిలీట్ ఆప్షన్ ఇచ్చారు కానీ ఆ ఆప్షన్ కనబడడం లేదు. డిలీట్ ఖాతాలో కాకుండా డబుల్ ఖాతాలో నమోదు చేయాలని చెప్పారు. అయితే సాప్ట్‌వేర్ ఒకటిగా ఇచ్చింది. మరొక్క యాప్ దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. కరెక్షన్ మాడ్యూల్‌లో సైతం ఇవ్వకపోవడంతో మరికొంత ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఇబ్బందులు పడటం కంటే యూజర్ ఫ్రెండ్లీ అనే ఒక ఆప్షన్ ఇస్తే తామే స్వయంగా ఈ ఇబ్బందులను సరిచేసుకునే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. కరెక్షన్ మాడ్యూల్‌లో సైతం ఇవ్వకపోవడంతో మరికొంత ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్ ఇస్తే మాత్రం ఒక్కవారం పదిరోజుల్లో ఈ సమస్యను గట్టెక్కించే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు. ఇప్పటికే సవరణలు 80శాతం పూర్తయినప్పటికి మరో 20శాతం కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ముందు చెక్కులు, పాస్‌బుక్‌లు పంపిణీ చేసిన సమయంలో మరోవారం రోజుల గడువు పెంచి ఉంటే సమస్యలు పరిష్కారం అయ్యేవని విఆర్‌ఓలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే రైతుల నుండి మరికొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని తమ ఖాతాల్లో తప్పులను ఎప్పుడు సరిచేస్తారని కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్నారు. ఇటు ధరణి వెబ్‌సైట్ సతాయించడంతో రైతులకు ఎలా చెప్పాలో అర్థం గాక రెవెన్యూ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
ధరణి వెబ్‌సైట్‌లో వెలువడుతున్న సమస్యలు:
మొబైల్ యాప్‌ను పునరుద్ధరించాలి.మొబైల్ యాప్‌కరెక్ట టైం పెట్టినవి కావడం లేదు.
ఖాతా డబుల్ ఉంటే వారిపై ఆప్షన్ లేదు. ఫౌవతి కొరకు అప్‌లోడ్ చేసినా కావడం లేదు.
ఫోటోలు సైతం రావడం లేదని, పార్టు ఏ లో ఉన్న డాక్యూమెంట్ పౌవతి విరాసత్, సాదాబైనామాలు మోటేషన్‌లో సర్వే నంబర్‌లు కనిపించడం లేదు.
తహసీల్దార్ ఒకే చేసినా మళ్లీ ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు, మోటివేషన్‌లో ఎన్ని నంబర్లు ఉంటే అన్ని కొత్త ఖాతాలు వస్తున్నాయి.
ఆధార్‌నంబర్లతో ఒకే ఖాతాల్లోకి వచ్చే ఆప్షన్ ఉండాలి, ఎక్కువ సర్వే నంబర్‌లు పౌవతి విరాసత్ కేసులో తొందరగా లాగిన్ కావడం వల్ల మోటివేషన్ ప్రక్రియ పూర్తి కావడం లేదు.

Comments

comments