Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇస్తాంబుల్ ఉగ్రదాడిలో ఇద్దరు భారతీయులు మృతి

Turkey-nightclub-attack

ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని ఓ నైట్‌క్లబ్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.  ఘటన నేపథ్యంలో భారత రాయబారి ఇస్తాంబుల్ బయల్దేరారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. మృతులను అబిస్ రిజ్వీ, గుజరాత్‌కు చెందిన ఖుషీ షాగా గుర్తించారు. కాగా అబిస్ రిజ్వీ రాజ్యసభ మాజీ సభ్యుడి కుమారుడని తెలుస్తోంది.  ఈ దాడిలో ఇప్పటి వరకు 39 మంది చనిపోగా, మరో 70 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. నైట్‌క్లబ్‌లో కొత్త సంవత్సరం వేడుకులు జరుపుకుంటున్న వారిపై ఉగ్రవాదులు విరుచుకుపడిన విషయం తెలిసిందే.

Comments

comments