Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఐటి విస్తరణ

ktr

హైదరాబాద్ నగరం నలుదిశలా ఐటి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం దృఢ సంకల్పం
అందుకు వీలుగా మౌలిక వసతుల కల్పన
తెలంగాణ ఏర్పడిన తరువాత జాతీయ సగటుకన్నా ఎక్కువగా నమోదైన రాష్ట్ర ఐటి పరిశ్రమ వృద్ధిరేటు
త్వరలో లక్ష కోట్లకు ఎగుమతులు
విస్తృత సమీక్షా సమావేశంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఐటి పరిశ్రమ వృద్ధి రేటు జాతీయ నగటు కన్నా ఎక్కువగా నమోదైందని, త్వరలోనే ఇది లక్ష కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. పెరుగుతున్న ఐటి పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభు త్వం గుర్తించిందని, ఈ దిశగా నగరంలోని ఐటి పరిశ్రమలను నలు దిశలా విస్తరింపచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఐటి విస్తరణ, భవిష్యత్తు వ్యూ హంపై బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం కెటిఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. టిఎస్‌ఐఐసి ఎం.డి వెంకట నర్సింహారెడ్డి, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి, రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, ఆర్ అండ్ బి, విద్యుత్, వాటర్ వర్క్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఐటి క్లష్టర్లకు తోడు గా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి వంటి కొత్త ప్రాంతాలకు ఐటి పరిశ్రమలను విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వ్వూహాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెరుగుతున్న ఐటి పరిశ్రమలకు అనుగుణం గా పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, ఆర్ అండ్ బి, జిహెచ్‌ఎంసి, మెట్రో రైలు, హెచ్‌ఎండిఎల తరఫున తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో కెటిఆర్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఐటి పరిశ్రమకు కేంద్రంగా ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపైన స్వల్పకాలిక లక్షాలతో చేపట్టాల్సిన చర్యలపైనా ప్రణాళికలు రూపొందించాలని టి ఎస్ ఐఐసి అధికారులను మంత్రి ఆదేశించారు. నూతనం గా ఏర్పాటు కానున్న మరో ఐటి క్లస్టర్ రాజేంద్రనగర్, బుద్వేల్‌లోనూ ఇప్పటి నుంచే అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. నూతనంగా ఏ ర్పాటు కాబోయే క్లష్టర్‌తో పాటు విస్తరించనున్న క్లష్టర్‌లో నూ రోడ్ల విస్తరణ, మురికి కాల్వల నిర్మాణం, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా మొదలైన అంశాలపై పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక ఐటి సంస్థలు నగరంలో నూతనంగా కార్యకలాపాలు లక్షలాది ఉద్యోగాలు ఐటి రంగం లో రానున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ పెరుగుదల ఒకే వైపు కాకుండా నగరంలోని నలుమూలలా వస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యల వంటి ఇబ్బందులు తలెత్తవని, సమ్మిళిత అభివృద్ధి దిశగా ఐటి పరిశ్రమలను తీసుకెళ్తామన్నారు. దీనికి అవసరమైన పోలీస్ స్టేషన్లు, అగ్ని మాపక కేంద్రాలు, ఫిజిబులిటీ ఉన్న చోట్ల మెట్రో, ఎంఎంటిఎస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాజేంద్రనగర్‌తో పాటు ఇతర ప్రాం తాల్లో చేపట్టాల్సిన భూసేకరణ వంటి విషయాల్లో రెవె న్యూ, టిఎస్‌ఐఐసి, రంగారెడ్డి జిల్లా యంత్రాంగం శాఖలు తీసుకోవాల్సిన చర్యలపైనా కెటిఆర్ ఉన్నతాధికారులతో చర్చించారు.

Comments

comments