Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మహబూబ్‌నగర్‌లో ఐటి పరిశ్రమలు

ktr

ముందుకు వచ్చిన 18 కంపెనీలు
అంగీకారపత్రాలు అందజేసిన ప్రభుత్వం

హైదరాబాద్ : తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమను విస్తరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భా గంగా పలు కంపెనీలు ఇందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐటి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన 18 కంపెనీలకు అంగీకార పత్రాలను క్యాంపు కార్యాలయంలో మంత్రులు కెటిఆర్, ప ట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఎంఎల్‌ఏ శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. హైదరాబాద్ నగరంలో ఐటి పరిశ్రమల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వివిధ ఐటి అనుబంధ పాలసీల ద్వారా ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం విస్తరిస్తోందని , నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాలతో పా టు ప్రస్తుతం మహబూబ్‌నగర్ లోనూ కంపెనీల స్థాపనకు వచ్చిన ఆసక్తి వ్యక్తీకరణే నిదర్శనమని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. త్వర లోనే మహబూబ్‌నగర్ ఐటి టవర్‌కు సంబంధించిన పరిపాలన అనుమతులను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రజా ప్రతనిధులు ప్రత్యేక శ్రద్ధతో ఆయా పట్టణాలలో ఐటి పరిశ్రమ ఏర్పాటుకు ఎన్‌ఆర్‌ఐలతో సమావేశం అయిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆసక్తి కనబరిచిన ఈ 18 కంపెనీలతో పాటు మరి న్ని సంస్థలను తమ జిల్లా కేంద్రానికి రప్పించేందు కు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో సహకారం తీసుకోవాలని కోరారు. మహబూబ్‌నగర్ లాంటి వెనుక బడ్డ జిల్లాకు ఈ చర్య మేలును చేకూర్చనుందని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. అప్పుడు విద్యార్థులకు, యువకులకు స్థానికంగా ఉద్యోగాల కల్పన కూడా సాధ్యమవుతుందన్నారు.

 

Comments

comments