Home తాజా వార్తలు ఇది ప్రజా విజయం : దత్తాత్రేయ

ఇది ప్రజా విజయం : దత్తాత్రేయ

DATTATREYA

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకంతో యుపిలో ప్రజలు బిజెపిని గెలిపించారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇది ప్రజా విషయమని ఆయన అభివర్ణించారు. దేశంలో మోడీ అంతటి బలమైన నేత మరొకరు లేరని ఆయన స్పష్టం చేశారు. యుపి, ఉత్తరాఖండ్‌లలో బిజెపి విజయం సాధించడంతో హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో సంబురాలు చేసుకున్నారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటమిని తన ఓటమిగా రాహుల్‌గాంధీ ఒప్పుకుని తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణాదిలో కూడా బిజెపి పాగా వేస్తుందని, ఎపి, తెలంగాణల్లో సైతం తాము పాగా వేస్తామని తెలంగాణ బిజెపి అధ్కక్షుడు లక్ష్మణ్ తెలిపారు.