Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ముచ్చటగా మూడవ సినిమా

rajini

ఇప్పుడు సౌత్‌లో క్రేజీ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న భామ నయనతార. ఈ భామ కెరీర్ ప్రారంభంలో  రజనీకాంత్‌తో నటించిన ‘చంద్రముఖి’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత  నయన్‌కు మంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ భామ నేడు సౌత్‌లో  స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.  రజనీతో నయనతార నటించిన రెండవ చిత్రం ‘కథానాయకుడు’. అందులో చిన్న పాత్ర చేసినప్పటికీ నయన్ మెరిసింది. ఆతర్వాత మళ్లీ  ఈ కాంబినేషన్‌ను తెరపై చూసే అవకాశం దక్కలేదు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని తెలిసింది. కాలా, రోబో సీక్వెల్ ‘2.0’ను పూర్తిచేసిన రజనీకాంత్ ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ అనే యంగ్ డైరెక్టర్ సినిమాలో నటించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో నయన్‌ను హీరోయిన్‌గా ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది. సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో లేడీ సూపర్‌స్టార్ నయనతార కలిసి సినిమా చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

Comments

comments