Search
Tuesday 20 November 2018
  • :
  • :

ప్రతిభతోపాటు తపన ముఖ్యం

Officeఒకటే వాతావరణం.. ఒకే తరహా పని.. ఉద్యోగం అంటే విసుగు, ఆసక్తి లేకపోవడం ఇలాంటివన్నీ చాలా మందిలో కనిపించే భావనలు. దీనివల్ల పనిలో శ్రద్ధ తగ్గుతుంది.  ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం జరుగుతుంది. ఇదే కొనసాగుతుంటే చివరికి ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఉద్యోగులకు నిత్యం ప్రేరణ. ఆలోచనలో కొంచెం మార్పు అవసరం. ప్రేరణకు ఆత్మవిశ్వాసానికి పరస్పర సంబంధం ఉంది. ఇందులో ఏది తగ్గినా సమస్యే. వృత్తి జీవితం లో ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. మిమ్మల్ని మీరు నమ్మకుంటే సంస్థ ఎలా నమ్ముతుంది?  వైఫల్యాలకు బెదరకుండా ప్రతిభ, నైపుణ్యాలు, ప్రత్యేకతలను పూర్తిస్థాయిలో చూపించాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం పెరగ డంతోపాటు ఫలితాలు మెరుగవుతాయి. ఒకే తరహా పనులు చేస్తున్నా కొన్ని లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. పనిలో ప్రత్యేకత చాటాలంటే నైపు ణ్యం, ప్రతిభతోపాటు తపన ముఖ్యం. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఉత్సాహం చూపాలి. విమర్శలను సానుకూలంగా స్వీకరించాలి. ప్రతికూలంగా తీసుకుంటే మనలోని లోపాలను తెలుసుకోవడం, సరిదిద్దుకోవడం కష్టం.  ఎంత బాగా చేసినా విమర్శలు వస్తున్నాయంటే మీ పర్యవేక్షకుడికి మీ పనిపై అంచనాలు ఎక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా పనిచేసేందుకు కృషి చేయాలి.  మంచి పుస్తకాలు చదవాలి. స్వయం కృషితో సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరిన ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోవాలి. ఒత్తిడిని జయించాలి. సమయానికి పనులు పూర్తిచేయడం, అనవసర చిక్కులకు దూరంగా ఉంటే ఒత్తిడి దరిచేరదు. వృత్తి జీవితంలో ఎదిగేందుకు కొత్త ఆలోచనలు వస్తుం టాయి.

Comments

comments