Home భద్రాద్రి కొత్తగూడెం భూములు లాక్కోడం సరికాదు

భూములు లాక్కోడం సరికాదు

It is not correct to revenue officers

ఆళ్ళపల్లి: దళితులు గత నలభై, యాబై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని రెవిన్యూ అధికారులు లాక్కోవడం సరికాదని ఆళ్ళపల్లి మండల దళిత సంఘం అధ్యక్షుడు బొమ్మెర నరేష్ అన్నారు. మండల పరిధిలో గల మర్కోడు గ్రామంలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం, శ్మశానవాటిక, ప్రభుత్వ గిడ్డంగులు నిర్మించడానికి దళితులు సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం దారుణమన్నారు. ఒక ప్రక్క ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, ఇవ్వకపోగా దళితులకు ఉన్న భూములను లాక్కోవడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి సాగులో లేని భూమిని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాస్కర్, ముసలయ్య, బాబు, ముత్తయ్య, రామయ్య, శ్రీను, సర్వయ్య, సమ్మయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.