Home జోగులాంబ గద్వాల్ సిఎం పై స్థాయిమరచి విమర్శించడం తగదు

సిఎం పై స్థాయిమరచి విమర్శించడం తగదు

kcr

– టిఆర్‌ఎస్ నేత బండ్లకృష్ణమోహన్‌రెడ్డి
మనతెలంగాణ/గద్వాలన్యూటౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శించే స్థాయి మాజీ మంత్రి ఎమ్మేల్యే డికె అరుణకు లేదని తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ్లకృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తెరాస పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్ర జాక్షేత్రంలో గెలవమనే భయంతో కోర్టుకెల్లి బయట పడిన వాళ్లు సీఎం కేసీఆర్ మీద ఇష్టమొ చ్చినట్లు ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. అధేవిధంగా ఇసుక గురించి మాట్లాడుతూ మంత్రి జూపల్లిపై ఆరోపణలు చేయడం చూస్తుంటే నవ్వొస్తుందని అవినీతికి మారుపేరుగా ఉన్న వీరు వీరి కుటుంబం ఒక్కసారిగా నిజాయితీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంద న్నారు. గతంలో కమీషన్ల కోసం గుత్తేదారులను బెదిరించిన సంఘటనలో కేసులు అయినది మరచిపోయారా..? అని ప్రశ్నించారు. ఈసారి మీకు ఖచ్చితంగా ప్రజల చేత గుణపాఠం తప్ప దని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ బీఎస్ కేశవ్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ జమ్మిచేడు చెన్నయ్య, ఎంపీపీ సుభాన్, సురేష్‌శెట్టి, సర్పంచీ శ్రీని వాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.