Home భద్రాద్రి కొత్తగూడెం నకిలీ… మకిలీ

నకిలీ… మకిలీ

It is not long after the time passed

ఏజెన్సీలో అమాయక గిరిజనాన్ని ఆసరాగా చేసుకుని పత్తి వ్యాపారం
బిల్లులు లేకుండా విత్తన ప్యాకెట్లు అంటగడుతున్న వైనం
తూతూ మంత్రంగా తనిఖీలు
కాలం గడిస్తేగాని బయటపడని బాగోతం

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా  వ్యావసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలే అధికంగా ఉన్నాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు విత్తనాల దుకాణాల వైపుకు పరుగులు తీస్తున్నారు. గత పది రోజులుగా విత్తన వ్యాపారుల దుకాణానాల్లో  రైతులతో కలకళ్లాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,71,035 ఎకరాల్లో రైతులు పలు రకాల పంటలు సాగిస్తున్నారు.ఇందులో వరి,పెసర, మినుము, జొన్నలు తదితర విత్తనాలు నాటే పొలాలు పోను కేవలం పత్తిని మాత్రం 1,34,337 ఎకరాల్లో సాగు చేస్తుంటారు. అయితే ఒక్కొక్క ఎకరాకు  రెండు పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం ఉండగా, 2,68,674 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరంగా ఉన్నాయి. ఒక్కొక్క పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.800 కాగా ఈ సీజన్లో రైతాంగం మొత్తం రూ. 21కోట్ల,49 లక్షల,39వేల,2 వందల విలువైన పత్తి విత్తనాలను కొనాలి. ఇప్పటికే 70 శాతానికిపైగా రైతులు విత్తనాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జిల్లాలో చాలా భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఉంది. దీంతో వరదలు వస్తే నాటిన విత్తనాలు దెబ్బతింటాయి. అధిక వర్షాలు వస్తే భూమిలోనే విత్తనాలు కుళ్లిపోతాయి. ఇవన్నీ కలిపీ మరళా కొనుగోలు చేయాల్సి పరిస్థితి ఎదురైతే సుమారుగా మరో రూ. 5 నుండి 10 కోట్ల మధ్యలో వెచ్చించాల్సి ఉంటుంది. అయితే మొత్తంగా సాగే పత్తి సాగులో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారంలో నిఖిలీ విత్తనాలు ఎన్నికోట్లవి అంటగట్టారో అర్థం కాని పరిస్థితి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధిక శాతం మంది గిరిజన రైతులే అధికంగా ఉన్నారు. వరిసాగుతో పాటు ఇక్కడ పత్తి, ఇతర విత్తన సాగులు అధికంగా చేస్తుంటారు. భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో గిరిజనులే అధిక శాతం మంది ఉన్నారు. వీరు స్వతహాగా సంపన్నులు కాకపోవడంతో అధికంగా విత్తన దుకాణ దారులు, వడ్డీ వ్యాపారుల నుండి అప్పులు తీసుకుని విత్తనాలు తెచ్చుకుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా…. ఈ రైతాంగాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న మారుమూల గిరిజన గ్రామాల్లో నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున అమ్మకాలు సాగించినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్కటిగా నకిలీ విత్తనాల విక్రయాలపై కథనాలు రావడంతో అప్రమత్తమైన వ్యవసాయాధికారులు, ఎన్‌ఫోర్సెంట్ అధికారులు జిల్లా వ్యాప్తంగా దాడులు విత్తన దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా సుమారు 325 దుకాణాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం 30 నుండి 50 దుకాణాల్లో మాత్ర మే తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడులు, తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. దీంతో అధికారులుదాడులకు వచ్చే సమయానికి అంతా సజావుగానే ఉన్న బోర్డులు ఉన్న చందంగా షాపులు ఉంటున్నాయని ఓ అధికారి చెప్పకనే చెబుతున్నారు. రైతుల వద్ద ఉన్న విత్తనాలు నాటితే గాని అవి మొలకెత్తేవా లేదా అనేది తెలుస్తుంది. మాటలకు మోసపోయిన నికిలీ లు నాటితే అంతే గతి. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లులు తీసుకుంటే ఆ బిలు ఆధారంగా నష్ట పరిహారాం కోరవచ్చు. కానీ బిల్లులే లేకుంటే ఎక్కడ కొన్నారో కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ యం త్రాంగం నిఖిలీలపై దృష్టి సారించి పేద రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.