Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఇతరులతో మాట్లాడటం తప్పుకాదు..

Employees

పనిచేసే చోట ప్రతిఒక్కరూ ప్రొఫెషనలిజం చూపించాలి. అంటే బాగా పనిచేయడం అనే అర్థం కాదు. పని వాతావరణంలో కొన్ని నియమాలూ, మాటతీరూ, నడతా, భావవ్యక్తీకరణా, కష్ట పడేతత్వం… ఇలా అన్నింట్లో తమదైన ముద్ర వేసుకోవడం. అప్పుడే ఉద్యోగినిగా నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకుంటారు. కానీ ఈవిషయం మాటల్లో చెప్పినంత తేలికైంది కాదు. సవాల్‌తో కూడుకుంది. దాన్ని ఎలా అధిగమించాలో చూద్దాం.
* కొందరు మహిళలు ఆఫీసులోకి అడుగుపెట్టాక పని తప్ప చుట్టుపక్కల ఏం జరుగుతోందో పట్టించుకోరు. నా పని నేను చేసుకుని ఇంటికి వెళ్తున్నానా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. ఎక్కడికక్కడ ప్రణాళిక పేరుతో తనకంటూ ఓ చక్రబంధనాన్ని ఏర్పరచుకుంటారు.

మరికొందరు పనిచేసే చోట ఇతరులతో ముఖ్యంగా మగవారితో మాట్లాడరు. ఎందుకంటే ఆఫీసులో ఇలా మాట్లాడినా, కాస్త స్నేహంగా ఉన్నా.. లేనిపోని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడతారు. కొన్నిసార్లు మహిళల్నీ దూరం పెట్టేస్తుంటారు. ఈ తీరు ప్రొఫెషనలిజం అనుకుంటే పొరపాటు. అలాగని అందరితో అతి చనువుగా అత్యుత్సాహంగా ఉండటం కూడా కాదు. ఈ రోజుల్లో ఎంచుకున్న రంగంలో రాణించాలంటే, కెరీర్ నిచ్చెనను పైపైకి ఎక్కేయాలంటే… పురుషులతో సమానంగా కష్టపడటం తెలిసుండాలి. ఏదయినా చేయగల సమర్థతా ఉండాలి. అలాగే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పెట్టుకోవాల్సిన నియమాలూ కొన్ని ఉంటాయి. అప్పుడే యాజమాన్యం నుంచి సరైన గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు కెరీర్ నిపుణులు.

Comments

comments