Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఇది అరుదైన వూసరవెల్లి

USARAVELLIనెల్లూరు : శ్రీపొట్టిరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జి.కొండారెడ్డిపల్లెలో అరుదైన వూసరవెల్లి ఒకటి కనిపించింది. గండిపాలెం – ఉదయగిరి మార్గంలో రహదారి పక్కన ఇది కనిపించింది. ఆకుపచ్చ రంగులో తొండ ఆకారంలో , శరీరం తెలుపు , గోధుమ రంగుతో కూడిన చారలు ఉన్నాయి. కెమిలియన్ అని పిలవబడే జాతి వూసరవెల్లి ఎక్కువగా సౌత్ అమెరికన్ అమెజాన్ అడవుల్లో ఉంటాయని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా రంగులు మార్చడం దీని ప్రత్యేకత అని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ వూసరవెల్లిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

Comments

comments