Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పర్యావరణ పరిరక్షణకు చర్యలు : కెటిఆర్

ktr-image

మేడ్చల్: ఘట్ కేసర్ మండలం పోచారంలోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యలక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని కెటిఆర్ అన్నారు. హరితహారంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 3300మెగా వాట్లతో సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేయడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నామని ఆయన వెల్లడించారు. నగరంలోని చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కైవైని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంఎంటిఎస్ రైళ్లను యాదాద్రి వరకు నడిపిస్తామని తెలిపారు. చెన్నై వాతావరణం, బెంగళూరు ట్రాఫిక్ తో పోల్చుకుంటే హైదరాబాద్ లో అనుకూల వాతావరణ పరిస్థిితి ఉందన్నారు. హైదరాబాద్ కు సమానంగా వరంగల్ ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ నగరంలో ఇదివరకే మహీంద్రా, సియంట్ ఐటి సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు.  వాటితో పాటు ఇన్ఫోసిస్ ని కూడా ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సివొవొ యుబి ప్రవీణ్ రావుతో పాటు పలువురు ప్రముఖలు పాల్గొన్నారు.

Comments

comments