Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

‘బాహుబలి 2’ ఔట్‌స్టాడింగ్ మూవీ

KTR-and-Bahubali2

హైదరాబాద్: ప్రస్తుతం దేశమంతట ప్రశంసలందుకుంటున్న మూవీ ‘బాహుబలి: ది కంక్లూజన్’. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ‘బాహుబలి 2’ను ఓ దృశ్యకావ్యంలా మలిచారంటూ దేశవ్యాప్తంగా సినీ అభిమానులు కొనియాడుతున్నారు.

హాలీవుడ్ మూవీని తలదన్నె విధంగా ఓ తెలుగు దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించడం విశేషమని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో రికార్డులు బద్దలు కొడుతూ, అద్భుతాలు సృషిస్తున్న ఈ మూవీ ఖ్యాతి రోజు రోజుకు పెరుగుతునే ఉంది.

ఇక సినీ, రాజకీయ ప్రముఖులు బాహుబలిని ప్రశంసలతో ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ కూడా చేరారు.

‘ఒక సినీ అభిమానిగా సుదీర్ఘ కాలంలో ఇలాంటి మాయాజాలం చూడలేదని, బాహుబలి2 విలక్షణమైన చిత్రం’ అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రం గురించి మాట్లాడానికి మాటలేవంటూ ఔట్‌స్టాడింగ్ మూవీ అని పొగడ్తలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన రాజమౌళి, శోభు యార్లగడ్డ, రానాలకు అభినందనలు తెలిపారు.

Comments

comments