Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

‘నాలుగేళ్లలోనే ఐటి ఎగుమతులు లక్ష కోట్లకు’

IT Minister KTR says IT Exports reached one lakh Crores

నిజామాబాద్: జిల్లాలో ఐటి హబ్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణ సర్కార్ ఏర్పడిన నాలుగేళ్లలోనే ఐటి ఎగుమతులు రూ. లక్ష కోట్లకు చేరుకున్నాయని మంత్రి వెల్లడించారు. 2013-14లో రాష్ట్రంలో ఐటి ఎగుమతులు రూ. 56వేల కోట్లు మాత్రమే అని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటి ఎగుమతులను రూ. లక్షా 20 వేల కోట్లకు తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నమన్నారు. ఈ సంవత్సరం వరకు రూ. లక్ష కోట్లకు చేరుకున్నామని, రాబోయే ఏడాది తమ లక్ష్యం నెరవేరుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. టిఎస్‌ఐపాస్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించామని కెటిఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐటిని రాష్ట్ర రాజధానికి మాత్రమే పరిమితం చేయకుండా, అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ తోపాటు నిజామాబాద్ ఎంపి కవిత, టిఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Comments

comments