Home తాజా వార్తలు అది పెద్దలు కుదిర్చిన వివాహం లాంటిది: ధోనీ

అది పెద్దలు కుదిర్చిన వివాహం లాంటిది: ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో తన అనుబంధం పెద్దలు కుదిర్చిన వివాహం లాంటిదని మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. ఐదు ఎపిసోడ్ల ‘రోర్ ఆఫ్ లయన్’ డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా తొలిభాగం బుధవారం రిలీజైంది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ డ్రామా సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎదుర్కొన్న రెండేళ్ల నిషేధంపై ఎంఎస్ ధోనీ మాట్లాడాడు. ‘తిరుంబి వందుతేను సొల్లు’ అనే శీర్షికతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పునరాగమనం చేసిందని ధోనీ వెల్లడించాడు.  ‘తిరుంబి వందుతేను సొల్లు’ అంటే ‘తిరిగొచ్చామని వాళ్లకు చెప్పండి’ అని అర్థం. సిఎస్‌కెతో తన అనుబంధం పెద్దలు కుదిర్చిన వివాహం లాంటిదని మహీ అన్నాడు. 2013 తన కెరీర్‌లో చీకటి అధ్యాయమని.. ఆ సమయంలో స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో చిక్కుకున్న సిఎస్‌కె ఫ్రాంచైజీపై జస్టిస్ లోధా కమిటీ 2015లో రెండేళ్ల పాటు నిషేధం విధించిందని ధోనీ తెలిపాడు.
స్పాట్‌ ఫిక్సింగ్‌కు కారకుడైన గురునాథ్‌ మెయప్పన్‌ ఫ్రాంచైజీ యజమాని కాడని, శ్రీనివాసన్‌ అల్లుడు మాత్రమేనని ధోనీ వివరించాడు. జట్టుకు శిక్ష అవసరమే కానీ దాని ప్రభావం మరీ కఠినంగా ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. 2018లో పునరాగమనం చేసిన సిఎస్‌కెని అందరూ ‘డాడీస్‌ ఆర్మీ’ అని వెక్కిరించారని… అందుకు కారణం ఆటగాళ్ల సగటు వయసు 33-34 ఉండటమేనని ధోనీ తెలిపాడు. 2018లో మూడోసారి ఐపిఎల్ టైటిల్ కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం అభిమానులేనని, తమపై వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని రుజువు చేయడానికే టైటిల్ సాధించామని ధోనీ వివరించాడు. ఈ ఎసిసోడ్‌లో సొఎస్‌కె ఆటగాళ్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, మోహిత్ శర్మ, కోచ్‌లు మాథ్యూ హెడెన్, మైకేల్ హుస్సి కనపించారు.
It was like an arranged marriage with CSK says Dhoni