Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

‘పెప్సికో’కు ఇంద్రానూయి గుడ్‌బై

Item 'PepsiCo' Indrauni Goodbye

12 ఏళ్ల తర్వాత సిఇఒ పదవి నుంచి వైదొలగనున్న నూయి

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ బిజినెస్ దిగ్గజం పెప్సీ కంపెనీ సిఇఒ పదవి నుంచి ఇంద్రా నూయి త్వరలో వైదొలగనున్నారు. భారత సంతతికి చెందిన నూయి 12ఏళ్లుగా సిఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూయి రాజీనామా నేపథ్యంలో ప్రెసిడెంట్ రామ న్ లగ్వార్ట ఆమెస్థానంలో బాధ్యతలు చేపట్టను న్నారు. త్వరలోనే నూయి తన బాధ్యతల నుంచి తప్పుకో నున్నా రని సోమవారం కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసిం ది. సంస్థతో 24 సంవత్సరాల అనుబంధం, సిఇఒ గా 12 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం ఆమె ఈ ఏడాది అక్టోబర్ 3న తన పదవికి రాజీనామా చేయనున్నారు. 62 ఏళ్ల ఇంద్రానూయి ప్రపంచంలో అత్యంత శక్తి వంత మైన మహిళా వ్యాపారవేత్తగా పేరు దక్కించు కు న్నారు. ఆమె స్థానంలో కంపెనీ ప్రెసిడెంట్ రామన్ ల గౌర్తా లగ్వార్ట బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే 2019 ఆరంభంవరకు ఆమెనే చైర్మన్‌గా కొనసాగుతారు. భారత్ లో జన్మించి పెప్సీకో వంటి అసాధారణ సంస్థను నడి పించే అవకాశం వస్తుందని తాను ఊహించలేదని నూయి అన్నారు. చాలా దృఢంగా ఉన్న కంపెనీ పెప్సీకో భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రెసిడెంట్ కావడానికి మందు లగౌర్తా లగ్వార్ట కంపెనీ యూరప్ సబ్ సహరన్ ఆఫ్రికా డివిజన్ సిఇఒగాపని చేశారు. నూయి 2006లో సిఇఒగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ షేర్లు 78 శాతం లాభపడ్డాయి.

1 అక్టోబర్‌లో సిఇఒ పదవి నుంచి ఇంద్ర నూయి వైదొలిగిన తర్వాత 2019 ప్రారంభం వరకు చైర్మన్‌గా కొనసాగుతారు.
2 కంపెనీ ప్రెసిడెంట్‌గా ఉన్న రామన్ లగ్వార్ట ఆమె స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ 53 ఏళ్ల చరిత్రలో ఆయన ఆరో సిఇఒ కానున్నారు.

3 పెప్సికి సిఇఒ అయిన తొలి విదేశీ మహిళ ఇంద్ర నూయి, తొలి మహిళ చిప్స్ అండ్ సొడా తయారు చేసే సంస్థకు నేతృత్వం వహించారు. గతేడాది ఆమె సార థ్యంలో సంస్థ ఆదాయం 63 బిలియన్లకు చేరింది.
4 ఎస్ అండ్ పి 500 కంపెనీలను నడిపిన సిఇఒల్లో ఎక్కువ కాలం పనిచేసిన మహిళ ఇంద్రనూయి.

Comments

comments