Search
Sunday 18 November 2018
  • :
  • :

రష్మీకి ఐటమ్ ఆఫర్

Rashmi-Gautamఇప్పుడు టాలీవుడ్ సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్ తప్పనిసరి అయిపోయాయి. స్టార్ హీరో సినిమా నుంచి లో బడ్జెట్ మూవీ వరకు ఎవరైనా సరే ఐటమ్‌సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారు. సాయిధరమ్‌తేజ్ నటించిన ‘విన్నర్’ మూవీ కోసం ఇప్పటికే హాట్ యాంకర్ అనసూయను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హాట్ యాంకర్ రష్మీగౌతమ్‌కు కూడా ఇదే ఆఫర్ వెళ్లినట్లు తెలిసింది. వంశీకృష్ణ దర్శకత్వంలో రాజ్‌తరుణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కిట్టుగాడు’లో రష్మీకి… ఐటమ్‌సాంగ్ ఆఫర్ వెళ్లిందట. అటు యాంకర్‌గా ఇటు హీరోయిన్‌గా రెచ్చిపోతున్న ఈ బ్యూటీ ఐటమ్‌సాంగ్ చేస్తుందా అనేది చూడాల్సిందే. అయితే గ్లామర్ షో విషయంలో పెద్దగా పట్టింపుల్లేని ఈ బ్యూటీ ఈ సాంగ్‌కు అభ్యంతరం చెప్పకోవచ్చు.

Comments

comments