Home ఎడిటోరియల్ శర్భనాపురం శ్రీఉమాశంకరుడు కాకతీయ గణపతి ‘దేవుడు’

శర్భనాపురం శ్రీఉమాశంకరుడు కాకతీయ గణపతి ‘దేవుడు’

Sri-Sri-Uma-Shankara-Temple

ఓరుగల్లు రాజధానిగా సుమారు మూడువందల సంవత్సరాలు పరిపాలించిన కాకతీయుల యుగం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగింది. ఈ కాలంలోనే తెలంగాణ ఒక పెద్ద స్వతంత్ర రాజ్యంగా, ప్రజలందరు తెలంగాణ అభిమానంతో, స్వేచ్ఛతో వర్థి ల్లారు. కాకతీయ సామ్రాజ్యం రుద్రదేవుడు, మహా దేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి పరిపాలించిన అనంతర కాలంలో ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానులకు పట్టుబడి బందీగా ఢిల్లీకి తీసుకు వెళు తుండగా నర్మదా నదీ తీరాన స్వయంగా దేహాన్ని చాలించాడు. అంతటి తో క్రీ.శ.1323 లో కాకతీయ సామ్రాజ్యం అంత రించింది.

అయితే కాకతీయ రాజులలో తెలుగు దేశాన్ని మొత్తం ఒకే ఏలుబడికిందికి తెచ్చి, ప్రజాశ్రేయస్సుకు అశేష కృషి చేసిన మొదటి రాజు గణపతిదేవుడు. గణపతి దేవుడు క్రీ.శ.1199 నుండి 70 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన శైవమతాభి మాని. గోళకి మఠానికి చెందిన విశ్వేశ్వరాచార్యుడను ప్రసిద్ధ పాశుపతి శైవా చార్యుని వద్ద శివదీక్ష పొందాడు. గణపతి దేవుడు శైవ మత వ్యాప్తికి తెలంగాణలో అనేక శివాలయాలను నిర్మించడంతో పాటు సాగునీరు అందించే పలు తటాకా లను కూడా నిర్మించాడు. పాలంపేట, పిల్లల మర్రి, నాగులపాడు, ఘనపురం, శర్భనాపురం మొదలగు చోట్ల శివాలయాలను నిర్మించిన ఘనత గణపతిదేవుడిదే. రామప్ప, పాకాల, లక్నవరం, బయ్యారం, పానగల్లు చెరువులు కూడా వీరి కాలంలోనే నిర్మింపబడినాయి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కాకతీయ యుగ స్ఫూర్తితో మిషన్‌కాకతీయ, ఓరుగల్లు పట్టణాభివృద్ధి నేపథ్యంలో గణపతిదేవుడు నిర్మించిన గొప్ప శివాలయాన్ని గురించి ప్రస్తావించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం, శర్భనాపురంగ్రామంలో కాకతీయ గణపతిదేవుడి భక్తికి నిదర్శనంగా శ్రీశ్రీశ్రీ ఉమా శంకర స్వామి దేవాలయం నిర్మిత మైంది. ఈ మహాశివ రాత్రి రోజున స్వామిని దర్శించుకునివేద స్వరూపుడు, నాద సహితుడు అయిన మహాశువుని ఆశీస్సులు పొంద డం ముక్తిదాయకంగా భక్తులు భావిస్తారు.

ఓం నమః శివాయ, ఓం నమఃశివాయ మంత్రం పఠించడం ఇక్కడ ప్రత్యేకత. కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక చిహ్నా లు, కోటలు, తటాకాలు, శివాలయాలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాలలో అనేకం ఉన్నాయి. శత్రు దుర్భేద్యమైన కోటగా రూపొందిన భువనగిరి దుర్గం, పానగల్లు లోని ఛాయల సోమేశ్వ రాలయం, అదే గ్రామంలో 65 స్థంభాల పంచేశ్వర ఆలయం, మూసీ, కృష్ణానదుల సంగమం వాడపల్లిలో నిర్మించిన కోట, ఆలయాలు, కాకతీయుల ఆస్థానకవి పిల్లలమర్రి పినవీరభ్రుదుని పేరున వున్న పిల్లలమర్రి గ్రామం భక్తులను ఆకర్షిస్తూ కాకతీయ యుగానికి తీపి గుర్తులుగా నిలిచివున్నాయి.

శర్భనాపురం
శర్భనాపురం చాలా చిన్న గ్రామమైనా, 700 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ప్రాంతానికి, కాకతీయ గణపతి దేవుడికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అధికంగా యాత్రలు చేస్తూండేవాడట. తన యాత్రలో భాగంగా ఒక రోజు శర్భనాపురం సందర్శించ డమే కాకుండా, ఇక్కడి అడవిలో తపసుస చేస్తున్న శరభ మహాముని కోసం ఒక ఆల యాన్ని కూడా నిర్మించినట్లు చరిత్రకారులు చెపు తున్నారు. శర్భనాపురం గ్రామంలోని శివా లయ నిర్మాణానికి ఉపయోగించిన స్తంభాలను చూస్తే ఓరుగల్లులో వెయ్యిస్థంభాల గుడి నుండి తెచ్చి ఈ శివాలయాన్ని నిర్మించినట్లు బోధపడు తుంది. ఈ ప్రాంతంలో తపస్సు చేసిన శరభ మహాముని పేరు మీద శర్భనాపురం అనే పేరు స్థిరపడింది.

కాకతీ యులు నిర్మించిన అనేక శివాలయాలు మంచి పోషణతో ఇప్పటికీ యాత్రి కులను ఆకర్షిస్తున్నాయి. శర్భనాపురం లోని శివాలయం మాత్రం ఎటువంటి ఆదరణ, పోషణ లేక కాలాంతరంలో జీర్ణావస్థకు చేరుకుంది. ఈ గ్రామంలోని శివాలయం పునరుద్ధరణకు వాస్తు రీత్యా అవకాశం లేదని వాస్తుశిల్పులు, వేద పండి తులు చెప్పినందున యీ గ్రామవాసి, హైదరా బాద్ నివాసి, శ్రావ్య గ్రాఫిక్స్ ప్రింటింగ్ ప్రెస్ యజ మాని చామల రవీందర్‌రెడ్డి, గణపతి దేవుడు భక్తిశ్రద్ధల తో నిర్మించిన శివాలయాన్ని ప్రతిబింబించే విధంగా మరొక శివా లయాన్ని నిర్మించారు. అదే శ్రీశ్రీశ్రీ ఉమాశంకరస్వామి దేవా లయం.

పది సంవత్సరాల క్రితం 2006 ఏప్రిల్ 27వ తేదీన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శంకరాచార్య నృసింహ భారతీస్వామి వారి చేతులమీదుగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ ఆలయ సముదాయంలో శివుడు, ఉమాదేవి, మహా గణపతి, శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ సుబ్ర మణ్యం, నవగ్రహ, విగ్రహాలు ఇక్కడ జరిగే మాసశివ రాత్రి, మహా శివరాత్రి ఇతర ఉత్సవాలకు భక్తులను నిరంతరం ఆకర్షిస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశ్రీశ్రీ ఉమాశంకరస్వామి దేవాలయాన్ని గుర్తించి ‘మనగుడి’ కార్యక్రమాన్ని నిర్వహించ డానికి అన్ని సహాయ, సహకారాలను అందిస్తున్నది.

రెండు తెల్లని హిమాలు-వెలుగునిచ్చే శివుడు
పానగల్లు గ్రామంలో కాకతీయులు నిర్మించిన శివాలయం లో ఒక ప్రత్యేక ఉంది. దినమంతా శివ లింగంపై ఒక విధమైన ఛాయ అగుపడుతుంది. అందుకే ఈ దేవాలయాన్ని ఛాయల సోమేశ్వర ఆలయం అంటారు. వాడపల్లికోటలో నిర్మించిన శివాల యంలో మరొక వింత మనకు దర్శనమిస్తుంది. అదే శివుని ముందు వుండే మినుక్కు మినుకుమనే దీపం. ఎల్లప్పుడు ఈ దీపం గాలిలో వీచినట్లు మినుక్కు మిను క్కుమంటూ మనకు దర్శనమిస్తుంది. ఇది పరమేశ్వరుని ఉచ్ఛాస, నిశ్వాసాలకు ప్రతీకగా భక్తులు భావిస్తారు.

అదేవిధంగా కాకతీయుల దేవాలయాలకు ప్రతి బింబంగా శర్భనాపురంలో నిర్మించిన శ్రీశ్రీ ఉమా శంకర స్వామి వారి దేవాలయంలో కూడా ఒక ప్రత్యేకత భక్తు లను ఆకర్షిస్తుంది. అభిషేక సమయంలో ఉదయం లింగంపై రెండు తెల్లని నామాలు కనిపించడం, రాత్రి అభిషేకాలలో మెరిసే నక్షత్రం అగుపడడం, ఈ దేవాలయ విశిష్టత. ఒక వైపు నామాలు, మరొకవైపు నక్షత్రం అగుపడడం మూలాన ఇక్కడి శివుని వెలుగు నిచ్చే శివుడిగా భావిస్తారు. ఈ అద్భుత నామాలు, నక్షత్రంతో భక్తు లు అనిర్వచనీయమైన ఆనందాను భూతులను పొంద టమే కాకుండా, వారిలో స్వామి వారిపై అనంత మైన భక్తి కలుగుతుంది. భక్తుల కోరికలను తీర్చే దేవిడిగా పూజిస్తారు. తెలంగాణలోని ఇతర దేవాలయాలతో పోల్చితే శ్రీ ఉమా శంకర స్వామి ఆలయం మరొక ప్రత్యేకతకు ఆలవాలంగా నిలుస్తుంది.

మహాత్మాగాంధీ, సేవలేని దైవభక్తి సాంఘిక పాపం అని అన్నారు. అందుచేత దేవాలయం పక్కనే ప్రజా సేవాకార్య క్రమాలు నిర్వహిం చేందుకు సి.వి.ఎన్.పబ్లిక్ రిలేషన్స్ ఫౌండే షన్ వారు ఒక విజ్ఞాన మందిరాన్ని నిర్మించారు. ఈ మంది రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల పూర్వపు ఛైర్మన్ జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి 2010 జూన్ 27వ తేదీన ప్రారం భించారు. ఈ విజ్ఞాన మందిరంలో కళ్యాణ మండపం, పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాల గ్రంథాలయం, జానపదకళల కేంద్రం, కంప్యూటర్ శిక్షణా తరగతులు, వీటన్నిటితోపాటు గ్రామంలో బతుకమ్మ పండుగ నుండి మొదలుకొని దీపావళి, మొహర్రం, వినాయక చవితి, ఉగాది, శ్రీరామ నవమి వరకు విజ్ఞాన మందిరం అన్ని ఉత్సవాలకు కేంద్రంగా ఉంటుంది.

మహాశివరాత్రి
దేవాలయ 11వ వార్షిక మహాశివరాత్రి ఫిబ్రవరి 23,24,25 తేదీలలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అమ్మవారి దివ్యకళ్యాణ మహోత్స వం, రుద్ర యాగాలు, సామూహిక కుంకుమార్చనలు , భేరిపూజ, త్రిశూల సానాలు, అన్నదానము మొదలగు భక్తిపూరిత కార్యక్రమా లలో పేర్కొనదగినవి.
(నేడు మహాశివరాత్రి)

-డా॥సి.వి.నరసింహారెడ్డి
ఆంధ్రప్రదేశ్, సమాచార,
ప్రజా సంబంధాల శాఖ పూర్వపు డైరెక్టర్
9246548901