Home దునియా రుద్రమ్మ కొలిచిన భద్రకాళి

రుద్రమ్మ కొలిచిన భద్రకాళి

Bhadrakali-Temple-in-Warang

మహాశక్తి స్వరూపిణీ. భక్తుల ఇలవేల్పు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీశ్రీ భద్రకాళి అమ్మవారు. జగన్మాత స్వయంభుగా వెలిసిన 18 శక్తి పీఠాలలో భద్ర కాళి అమ్మవారు ఒకరని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు మూర్తి దశావతారులు ఎలా ఉన్నాయే దుర్గా మాతకు కూడాకాళి, తార, శోడశి, భునేశ్వరీ, భైరవి, చిన్నమస్తా, చాగళ, మాతంగి, కమలాత్మిక, భోమవతి ఇలా దశ మహా విద్యలంటారు. శక్తి ఉపాశనులో మహాదశ శక్తి పీఠాలుగా పిలుస్తారు. భద్రకాళి అమ్మ అవిద్యను పోగొడుతుంది కాబట్టే మహాదేవతని, మహా విద్యని కీర్తిస్తుంటారు. అమ్మ వారిని దర్శించుకొని వెళ్లితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. దేశ, విదేశాల నుంచి వరంగల్‌కు వచ్చిన వారు తప్పనిసరిగా భద్రకాళి అమ్మవారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

7వ శతాబ్ధంలో భద్రకాళి ఆలయ నిర్మాణం
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతమంతా చాళుక్యుల పాలనలో ఉంది. చాళుక్య వంశానికి చెందిన రెండవ పులకేశి యుద్ధా నికి ఓరుగుల్లులోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని బయలుదేరి వేంగి రాజ్యాన్ని జయించి రాజ్యాస్థాపన చేశాడు. భద్రకాళి అమ్మవారి కరుణా కటాక్షాల వల్లనే రాజ్యస్థాపన చేయగలిగానని భావించిన పులకేశి 7వ శతాబ్ధం 625వ సంవత్సరంలో భద్రకాళి అమ్మవారి దేవాల యాన్ని వరంగల్ నగరంలో నిర్మించారు. ఆ తరువాత వచ్చిన కాకతీయ రాజులు భద్రకాళి అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలిచారు. కాకతీయ సామ్రాజ్యానికి మొదటి రాజధాని హనుమకొండ చేసుకొని పాలించారు.తరువాత తమ రాజధానిని ఏకశిలా నగరమైన ఓరుగల్లు రాజధానిగా పరిపాలన చేశారు. గణపతిదేవ చక్రవర్తి వద్ద మంత్రిగా పనిచేసిన ఎర్రయని భద్రకాళి ఆలయాన్ని ఆనుకొని భద్రకాళి తటాకం(చెరువు) నిర్మాణం చేశారు.

కాకతీయుల పాలన తరువాత తగ్గిన వైభవం
భద్రకాళి వైభవం కాకతీయుల పాలన తరువాత తగ్గిపో యింది. కాకతీయులలో చివరి రాజు ప్రతాపరుద్రునిపై మహమ్మద్ బిన్‌తుగ్లక్ దాడి చేసిన సందర్భంలో భద్రకాళి ఆలయాన్ని ధ్వంసం చేయడంతో భద్రకాళి వైభవం సన్న గిల్లింది. కాకతీయ సామ్రాజ్య పతనం నుంచి భారత దేశాని కి స్వాతంత్య్రం వచ్చి తెలంగాణ యూనియన్ ప్రభుత్వంలో కలిసేంత వరకు భద్రకాళి వైభవం మసకబారినట్లయింది. యూనియన్ ప్రభుత్వంలో కలిసిన తరువాత క్రమంగా ఆలయ వైభవం ఉచ్ఛస్థితికి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత పూర్వవైభవాన్ని సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, కంఠాభరణాలు చేపిస్తానని మొక్కుకున్న కెసిఆర్ రాష్ట్రం వచ్చిన తరువాత స్వయంగా 12కిలోల బంగారు ఆభరణాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.

ఇక్కడ బలులు నిషేధం
భద్రకాళి ఆలయం వద్ద జంతు బలులు జరగవు. భద్రకాళి ఆలయాన్ని ప్రతిష్టంచినప్పుడు బలులు జరిగేవని నానుడి. అయితే ఓరుగల్లు మహానగరంలో జన్మించిన వేదభాషాకర్త అయిన విద్యారణ్యుడు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని జంతు బలులు జరగకుండా మనస్సు మార్చాడనే నానుడి ఉంది. విద్యారణ్యుడు శృంగేరి 12వ పీఠాధిపతి కావడం వల్ల ఇక్కడ కూడా శృంగేరి సంప్రదాయలే కొనసాగుతున్నాయి. భద్రకాళి ఆలయంలో చిన్న పిల్లలకు విద్యాభ్యాస కార్యక్రమం చేపిస్తారు. తప్పనిసరిగా జంతుబలలు చేయాలనుకునే వారు భద్రకాళి చెరువు కట్ట పక్కన ఉన్న కట్టమైసమ్మ గుడివద్ద చేస్తారు.

భద్రకాళిలో ప్రత్యేక ఉత్సవాలు
దేశ వ్యాప్తంగా చైత్రమాసంలో వసంత నవరాత్రి ఉత్సవా లు, ఆశ్వయుజ మాసంలో జరిగే దేవీ నవరాత్రులు జరు గుతాయి. దేశంలో ఎక్కడ జరుగని విధంగా దేవీ భాగవత శరన్నవరాత్రి ఉత్సవాలు(చతుష్టయం) వరంగల్ భద్రకాళి దేవాలయంలో మాత్రమే జరుపుతారు. వైశాఖ శుద్ధ పంచమినాడు శంకరుడు భద్రకాళిని వివాహమాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దానిని పురస్కరించుకొని వైశాఖ శుద్ధ పంచమి రోజున అమ్మవారి కల్యాణం జరిపి పది రోజులపాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహి స్తారు. శ్రావణ మాసంలో పవిత్రోత్సవం నిర్వహిస్తారు. కృష్ణాష్టమి రోజును అమ్మవారిని కృష్ణునిగా అలంకరిస్తారు.

ఆషాడ మాసంలో శాకాంబరి ఉత్సవాలు
ఆషాడ మాసం గ్రీష్మరుతువులో భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను 15 రోజులపాటు దేదిప్యమానంగా నిర్వహిస్తారు. పూర్వం దేశంలో నూరేళ్ల కరువు రావడంతో మునులు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భద్రకాళి అమ్మ శాకంలతో(కురగాయలు, ఫలంలతో) ప్రసన్నం అయింది. కళ్ల నుంచి జలప్రథం కురిసి భూమండలంలోని నదీనదంలు, హ్రదములన్ని జలమయమయ్యాయి. అప్పటి నుంచి భద్రకాళి అమ్మవారి శాకాంబరిఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మార్కెండే పురాణం లోని దేవీ మహాత్యంలోని 11వ అధ్యాయంలో చెప్పబడిం ది. భద్రకాళి ఆలయంలో 1979 నుంచి శాకాంబరి ఉత్సవా లను 15 రోజులపాటు నిర్వహిస్తారు. గ్రీష్మ రుతువులో నిర్వహించడం వల్ల రైతులు నాట్లు, ఇతర పంటలను వేసుకొని ఉండడం వల్ల పంటలకు క్రిమికీటకాలతో నష్టం జరుగకుండా ఉంటుందని నమ్మకం. భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకాంబరి ఉత్సవాలను చూసి ఇప్పుడు బెజవాడ కనకదుర్గతోపాటు దేశంలోని మరికొన్ని ఆలయాలలో శాకాంబరి ఉత్సవాలు జరుపుతున్నారు.