Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

దిల్‌రాజుతో నా హ్యాట్రిక్ హిట్ ‘డిజె’: అల్లు అర్జున్

AAఇటీవల విడుదలైన ఈ సినిమా థాంక్స్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘దిల్‌రాజు, నా కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ హిట్ మూవీ. దిల్‌రాజు బ్యానర్‌లో ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ కావడానికి కారణం ప్రేక్షకులే. ఇటువంటి అల్ట్రా మాస్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. మా సినిమా చాలా మంది ఎన్నారైలకు నచ్చింది. కాబట్టి యూనిట్ అంతా అమెరికాకు వెళ్లి వారందరినీ కలుస్తాం’  అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘మా బ్యానర్‌లో చేసిన ఈ 25వ సినిమా బన్నీ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. నాలుగు రోజుల్లో 75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఒక వారంలో వంద కోట్లు కలెక్ట్ చేయనుంది’  తెలిపారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘బన్నీ నన్ను నమ్మి ఈ సినిమా చేసి మంచి విజయాన్ని అందించాడు. హీరోలను అభిమానించే దర్శకుల్లో నేను ప్రథముడిని. సినిమాలో డైలాగ్స్‌కు మంచి పేరు వచ్చింది. దిల్‌రాజు నాపై, హీరోపై నమ్మకంతో భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినందుకు థాంక్స్’  చెప్పారు. ఈ కార్యక్రమంలో పూజా హెగ్డే, రావు రమేష్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, అయాంక బోస్, సమీర్, బాలాజీ, ఛోటా కె.ప్రసాద్ పాల్గొన్నారు.

Comments

comments