Home ఎడిటోరియల్ ఇది ఫాసిస్టు ప్రభుత్వం కాదు సుమా!

ఇది ఫాసిస్టు ప్రభుత్వం కాదు సుమా!

లోక్‌సభలో స్థిరమైన మెజారిటీతో కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటం, అధికారంలోని ప్రభుత్వ స్వభావం గూర్చి వామపక్ష తరగతుల్లోపల, కొందరు ఉదార మేధావుల్లోపల చర్చకు దారి తీసింది. మోడీ ప్రభుత్వం ఏర్పడటంతో దేశంలో మితవాద దాడి చూస్తున్నాం. మితవాద నయా ఉదారవాద ఆర్థిక విధానాలను, హిం దూత్వ ఎజెండాను దుందుడుకుగా ముందుకు తీసుకెళ్లటాన్ని కలగల పటం ఈ దాడి లక్షణం. ఈ దాడిని ఎదుర్కోవటం ఎలా అన్నది నేడు భారతదేశంలోని వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ముందున్న ప్రాథమిక ఆందోళన. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని ఫాసిజం ఆగమనంగా వామపక్షంలో, ఉదార భావాలు గలవారిలో గణనీయ మైన విభాగం అభివర్ణిస్తున్నది. ఈ ఆలోచనలోపల ప్రభావవంతమైన స్రవంతి ప్రస్తుత ప్రభుత్వాన్ని “మతోన్మాద ఫాసిస్టు”గా నిర్వచిస్తున్నది. ఇది ఫాసిజానికి భారతీయ రూపం అని వాదిస్తున్నది. భారతదేశం ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది? పాలక ప్రభుత్వం గూర్చి, అది ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ ఉద్యమం గూర్చి సరైన అవగాహన అవసరం. ఎందుకంటే, బిజెపిపై, మోడీ ప్రభుత్వంపై పోరాడే నిమిత్తం అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం, ఎన్నికల ఎత్తుగడలతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది. బిజెపి స్వభా వాన్ని నిర్వచించటంలో స్పష్టత ఉండాలి. బిజెపి సాధారణమైన బూర్జువా పార్టీ కాదు. దాని ప్రత్యేక లక్షణం రాష్ట్రీయ స్వయం సేవక్ తో దాని సజీవ సంబంధాల్లో ఉంది. దాని ఆర్థిక, సామాజిక ఎజెం డాకు సంబంధించి బిజెపి మితవాద పార్టీ, దాన్ని మెజారిటీవాద మత తత్వ పార్టీగా, స్వభావీకరించవచ్చు. అంతేగాక, అర్థఫాసిస్టు భావ జాలం కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌తో దాని అనుసంధానం దృష్టా, పరిస్థి తులు తప్పనిసరిచేస్తున్నాయి అని అది విశ్వసించినపుడు నిరంకుశ పెత్తందారీ (అథారిటీరియన్) రాజ్యాన్ని ప్రజలపై విధించగల సామర్థం కలిగిన పార్టీ.

ఫాసిజం అనేది ఒక భావజాలంగా, రాజకీయ పరిపాలన రూపంగా 20వ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఆవిర్భ వించింది. పెట్టుబడిదారీ వ్యవస్థ లోతైన సంక్షోభంలో చిక్కుకున్నప్పు డు, కార్మిక వర్గ విప్లవోద్యమం నుంచి ప్రమాదం ఎదురైనపుడు జర్మనీ లోని పాలక వర్గాలు అత్యంత తీవ్రమైన పాలనా రూపాన్ని ఎంచుకుని బూర్జువా ప్రజాస్వామ్యాన్ని రద్దు చేశాయి. ముస్సోలినీ ఇటలీ, జపా న్ కూడా ఫాసిస్టు ప్రభుత్వాలే. ఫాసిజానికున్న శాస్త్రీయ నిర్వచనం విషయంలో అస్పష్టతకు తావులేదు. అధికారంలో ఉన్న ఫాసిజం “ద్రవ్య పెట్టుబడికి చెందిన అత్యంత అభివృద్ధి నిరోధక, అత్యంత జాతీయ దురహంకార, అత్యంత సామ్రాజ్య వాద శక్తుల బాహాట టెర్రరిస్టు నియంతృత్వం”. భారతదేశంలో నేడు, ఫాసిజం నెలకొల్ప బడలేదు ఫాసిస్టు ప్రభుత్వం నెలకొల్పేందుకు అవసరమైన పరిస్థితులు – రాజకీయ, ఆర్థిక, వర్గ పరిభాషలో లేవు. పెట్టుబడిదారీ వ్యవస్థ మూసిపోయే ప్రమాదం తెచ్చిపెట్టే సంక్షోభం లేదు. భారతదేశంలోని పాలక వర్గాలు తమ వర్గ పాలనకు ముప్పును ఎదుర్కోవటం లేదు. పాలక వర్గంలోని ఏ విభాగం కూడా బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థను కూలదోయటానికి ప్రస్తుతం పని చేయటం లేదు. పాలక వర్గాలు చేస్తున్నదేమంటే – తమ వర్గ ప్రయోజనాలు నెరవేర్చుకునే నిమిత్తం నిరంకుశ పెత్తందారీ రూపాలను ఉపయోగించు కుంటున్నాయి. భారతదేశంలో నేడు, ప్రజలను మత మార్గాల్లో విభజించటానికీ, మతపరమైన మైనారిటీలపై దాడి చేయటానికీ హిందూత్వ భావ జాలం, దురహంకార జాతీయ వాదం ఉపయోగించ బడుతున్నాయి. మతపరమైన మైనారిటీలను అణచివేయటానికి పాశవికమైన పద్ధ తులు ఉపయోగించబడుతున్నాయి. అసమ్మతికి, లౌకిక మేధావులకు “జాతి వ్యతిరేక” ముద్ర వేస్తూ వారిని అణగదొక్కే ప్రయత్నాలు జరు గుతున్నాయి. హిందూత్వ మార్గాల్లో సమాజాన్ని, రాజకీయాలను పునర్వవస్థీకరించే నిమిత్తం రాజ్య సంస్థల స్థాయిలో పైనుంచి, హిందూత్వ బ్రిగేడ్ సంస్థల ద్వారా దిగువ నుంచి దృఢ సంకల్పంతో కూడిన ప్రయత్నం జరుగుతున్నది. ఈ కార్యకలాపాలు ప్రజాస్వా మ్యానికి, లౌకికవాదులకు తీవ్రమైన ప్రమాదం తెస్తున్నాయి. అయితే అంతమాత్రాన అవి ఫాసిస్టు వ్యవస్థను నెలకొల్పజాలవు.

భారతదేశం నేడు, నిరంకుశ పెత్తందారీతనం పురోగమనంతో తలపడుతున్నది. నయా ఉదారవాదం, మతోన్మాదం శక్తిమంతంగా కలగలిసి దానికి ఆజ్యం అందిస్తున్నాయి. హిందూత్వ మతోన్మా దంగాక, నిరంకుశ పెత్తందారీతనానికి మరో ప్రధాన వనరు మితవాద నయా ఉదారవాదాన్ని ముందుకు తీసుకెళ్లటం. నయా ఉదారవాద ప్రభుత్వం ప్రజాస్వామిక ఆవరణను కుదించటానికి, బూర్జువా పార్టీలన్నిటినీ ఏకరీతి ఆలోచనలోకి తీసుకురావటానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని డొల్ల చేయటానికి, ప్రాథమికమైన విధానాలు రూపొందించటంలో ప్రజలను శక్తిహీనులు గావించ టానికి కృషి చేస్తుంది. ప్రపంచంలో నేడు, వివిధ దేశాలకు చెందిన సామ్రాజ్యవాదం, పాలక వర్గాలు తమ వర్గ పాలనను యధేచ్ఛగా కొనసాగించేందుకు, నయా ఉదారవాద విధానం అమలు జరిపేందుకు బాహాట ఫాసిస్టు పాలన కన్నా వివిధ రకాల నిరంకుశపెత్తందారీ పద్ధతులు ఉపయో గిస్తున్నాయి. అటువంటి నిరంకుశ పెత్తందారీతనాన్ని లాంఛన పూర్వక ప్రజాస్వామ్యం, ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉన్నటువంటి వ్యవస్థపై విధించవచ్చును. ప్రపంచంలో నేడు, పలు రకాల నిరంకుశ పెత్తందారీ ప్రభుత్వాలున్నాయి. కొన్నింటిలో, నిరంకుశ పెత్తందారీ వ్యవస్థను విధించే నిమిత్తం మత, జాతి మార్గాలలో రాజకీయ సమీ కరణ చేయబడుతున్నది. మతంపై ఆధారపడిన మతోన్మాదం లేక రాజకీయ సమీకరణను అత్యంత మితవాద ఆర్థిక విధానాల విధింపు అనుసరిస్తున్నది. అటువంటి దేశాల్లో భారత ఒకటి.

మత ప్రాతిపదికపై రాజకీయ సమీకరణ, నిరంకుశ పెత్తందారీ విధానానికి సంబంధించి భారత్, టర్కీ మధ్య గట్టి సారూప్యతలు న్నాయి. 2014 మే నెలలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఉమ్మడి లక్షణాల గూర్చి రాసిన వారిలో ప్రథముడు రచయిత అమితవ్ ఘోష్ ప్రజలను సమీకరించే నిమిత్తం రెండు దేశాల్లోని పాలక పార్టీలు మతంపై ఆధారపడిన “జాతీయ వాదాన్ని” ఉపయో గిస్తున్నాయి. జస్టిస్ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (ఎకెపి) ఇస్లామిస్ట్ పార్టీ, కాగా హిందూత్వపై ఆధారపడిన పార్టీ బిజెపి. రెండు ప్రభుత్వాలకు నిరంకుశ పెత్తందారీ లక్షణాలు కలిగిన బలమైన నాయకులు -రిసెస్ ఎర్డోగన్, నరేంద్ర మోడీ ఉన్నారు. ఎకెపి టర్కిష్ రాజ్యాన్ని లౌకికరహితం చేయటానికి ప్రయత్నిస్తూ కుర్దిష్ మైనా రిటీపైన, లౌకిక మేధావులపైన దాడి చేస్తున్నది. బిజెపి, మోడీ ప్రభు త్వం మైనారిటీలను లక్షంగా పెట్టుకుంది. లౌకిక మేధావుల అస మ్మతి గళాలను నొక్కివేయటానికి ప్రయత్నిస్తున్నది. రెండు ప్రభుత్వా లు నయా ఉదారవాదాన్ని , ఆలింగనం చేసుకున్నాయి. అయినా, టర్కీ లేక భారత్‌లోని ప్రభుత్వాన్ని లేక రాజ్యాన్ని ఫాసిస్టుగా అభి వర్ణించటం తప్పు అవుతుంది. వాటిని మితవాద నిరంకుశ పెత్తందారీగా అభివర్ణించటం మెరుగు. మోడీ ప్రభుత్వం అమెరికాతో పెంపొందించుకుంటున్న సైనిక సహకారం, వ్యూహాత్మక సంబంధాల ద్వారా తన నిరంకుశ పెత్తందారీ తనాన్ని పటిష్టపరుచుకుంటోంది. అందువల్ల ఫాసిస్టు – ఫాసిస్టు వ్యతిరేక శక్తుల మధ్య నేరుగా పోరాటం కన్నా బిజెపి – ఆర్‌ఎస్‌ఎస్ కూటమికి వ్యతిరేకంగా పోరాటం ఎంతో జటిలమైంది, బహుముఖీనమైంది.

బిజెపిని, దాని పోషకురాలైన ఆర్‌ఎస్‌ఎస్‌ను రాజకీయ, సైద్ధాం తిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఎదుర్కొవాలి. మతోన్మా దానికి వ్యతిరేకంగా పోరాటాన్ని నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా పోరాటంతో మిళితం చేసి బిజెపిపై, మితవాద మతోన్మాద శక్తులతో పోరాటం నిర్వహించాల్సి ఉంటుంది. రెండు ప్రధాన పార్టీలు – బిజెపి, కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటిగా పాలక వర్గాలకు నయా ఉదార వ్యవస్థను నడుపుతున్నందున, పాలక వర్గాల్లోని రెండో ప్రధాన పార్టీతో అలయెన్స్‌తో బిజెపిపై రాజకీయ పోరాటం చేయలేము. ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికలు నిష్ప్రయోజనంగా ఉండే ఫాసిస్టు వ్యవస్థపై పోరాటంలో లాగా కుకుండా, భారతదేశంలో ఎన్నకల పోరాటం కూడా ముఖ్యమే. ఇప్పుడు పోరాటం ఫాసిజంపై అనే నినాదం బిజెపికి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించవలసినటువంటి కొన్ని కీలకమైన సమస్యలను మెరుగుపరుస్తుంది. దాని దాష్టీక ఆర్థిక విధానాలు, బడా వ్యాపారులకు, ద్రవ్య పెట్టుబడికి అడుగులకు మడు గులొత్తటం, ప్రజల జీవనోపాధులను, ఆర్థిక హక్కులను దెబ్బతీస్తున్న సమస్యలు వాటిలో ఉన్నాయి. దేశంలో ఈనాడు నెలకొంటున్న నిర్దిష్టమైన పరిస్థితి – మతో న్మాదానికి వ్యతిరేకంగా ప్రజాతంత్ర, లౌకిక శక్లులన్నింటి సువిశాల సమీకరణను బలంగా కోరుతున్నది. ప్రత్యామ్నాయ కార్యక్రమం ప్రాతిపదికపై వామపక్ష ప్రజాతంత్ర శక్తుల రాజకీయ అలయెన్స్ నిర్మాణాన్ని కూడా కోరుతున్నది. అటువంటి ద్విముఖ దృక్పధం మాత్రమే భారతదేశంలోని మితవాద శక్తులను అదుపు చేయగలదు, వెనక్కి కొట్టగలదు.

ప్రకాశ్ కారత్, 
సిపిఐ (ఎం) పూర్వ ప్రధాన కార్యదర్శి
ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడు