Home దునియా ఈనాటిదా డ్రగ్స్ చరిత్ర..!

ఈనాటిదా డ్రగ్స్ చరిత్ర..!

Drugs-Story

“డ్రగ్‌” (Drug) అనే దానికి W.H.O (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ఇలా నిర్వచనం చెప్తుంది. “జీవించే ప్రతిప్రాణి (Living Organisation) భుజించి నప్పుడు ఆ ప్రాణి యొక్క ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ జీవక్రియలు విధులలో మెరుగైన ఫలితాలను కల్గించేది”(Any subtance that when taken into the living organism may modify one or more funtions) Drug లేకుండా మానసికంగా, శారీరకంగా గడపలేక గడవలేక పోవటం, వాటి యొక్క ప్రభావాలను కంటిన్యూగానో, లేక పీరియాడికల్ గానో పొందితీరాలనే తపన కల్గివుండటం ఈ ప్రభావం లేకపోవటం వల్ల వచ్చే అసౌకర్యాన్ని తట్టుకోలేకపోవటం స్థితులను Drug dependacey గా W.H.O గుర్తించింది. “మందు” వైద్య అవసరాలకు సద్వినియోగపడేది. ఆ మేరకు నికోటిన్ దగ్గర్నుంచి L.S.D. వరకూ అన్ని దుర్వసనాలే. డ్రగ్స్‌కు లోబడిపోవటం ఒక మానసిక సమస్య.

ప్రాచీనకాలం నుండి మత్తుపానీయాల సేవనం భారతీయులకు పరిచయం వున్నదే. క్రీ.పూ. 2000 సం॥ల నాడే “సోమ” రసాన్ని సేవించటం జరిగింది. దక్షిణ భారతదేశంలో “కల్లు” మత్తుపానీయం. రామాయణ, మహాభారతాల్లో “మధు” అనే మందు కొట్టినట్లు అనేక ఉదాహరణలున్నాయి. మందేస్తూ చిందేయటం, మత్తులో తేలిపోవటం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఈ మత్తు పదార్థాల వినియోగంలోకి “నల్లమందు” ప్రవేశించటం ఒక విప్లవాత్మకమైన మార్పు. ఈ విప్లవాన్ని మనకు తీసుకొచ్చింది ముస్లీం పాలకులు. పర్షియా, ఆఫ్ఘనిస్థాన్‌ల నుంచి ఈ నల్లమందు దిగుమతి అయ్యింది.

కొకైన్‌ని సిక్కులు పరిచయం చేశారు. వివా హాది శుభకార్యాలలో దీన్ని వాడటం ఒక ఖుషీ అలవా టుగా మాత్రమే కాదు. దీని వాడకం వెనుక మతపరమైన ప్రాధాన్యత కూడా వుండేది. ఇది ఆయుః ప్రమాణాన్ని పెంచుతుందని, మెడిటేషన్‌కి మంచిదని, ఆకలి, దాహా లను అరికట్టి ధ్యాన నిమగ్నతకు సాయపడ్తుందని నమ్మ కం. దీన్ని హిందువులు, ముస్లింలే విరివిగా ఉపయో గించేవారు. మొదట్లో ఇది బీహారు, బెంగాల్ రాష్ట్రాలకే పరిమితమై వుండి క్రమంగా ఉత్తర భారతమంతా విస్తరిం చింది. విప్పసారా, సామాజికంగా ఆర్థికంగా క్రింది తర గతి వాళ్ళు వినియోగించే మత్తు పానీయం.

మత్తు పదార్థాల వినియోగానికి కారణాలు
శారీరక కారణాలు : శరీరం మెదడు మత్తు పదార్థాల వాడకానికి, దానివల్ల కలిగే మార్పులకు అలవాటు పడిపోవటం, పొరబాటున ఒకసారి సేవించిన ఫలితంగా ఈ రసాయన వ్యవస్థ ప్రభావానికి లోనై ఆ తర్వాత ఇది లేకపోతే పలు అవలక్షణాలను కల్గించటం జరుగుతుంది. కాకపోతే మత్తు పానీయాల వాడకానికి శారీరక కారణాలే పూర్తి బాధ్యత వహిస్తాయని చెప్పలేం. ఇవి అనేక కారణాలలో ఒక కారణం కాగలవు.
మానసిక కారణాలు : మనో విశ్లేషణా సిద్ధాంతం, దీనిని మౌఖిక నిబంధన (Oral Fixation) అంటుంది. బాల్యదశలో మనో లైంగిక వికాసం సరిగ్గా జరగని నేపధ్యంలో ఈ అలవాటు బయట పడ్తుందని అంటుంది. సిగరెట్ కాల్చడం, మందు కొట్టటం వెనుక బాల్యదశలో తల్లిప్రేమ దూరం కావటం తల్లిద్వారా “ఆర్తి” సరిగ్గా తీరకపోవటం కారణాలని ఫ్రాయిడ్ అంటాడు. కానీ బిహేవియరిస్టులు మత్తు పదార్థాలకు బానిసలు కావడం ఒక అభ్యసన ప్రక్రియ అంటారు. డబ్యూ హెచ్ ఒ ఈ క్రింది అంశాలను మాదక ద్రవ్యాలకు బానిస కావడానికి కారణాలుగా ధృవీకరించింది.

దీర్ఘకాల దుష్పలితాలను పట్టించుకోకుండా, తాత్కాలిక సంతోషం కోసం వెంపర్లాడే మనస్తత్వం, మూర్తిమత్వలోపం.
-సాంఘిక సంబంధాల్లో , స్వయం తృప్తి కోసం , మనిషి విచలన పూరితమైన ప్రవర్తనను అలవర్చుకోవాలను కోవడం.
మానసిక ఒత్తిడిని నివారించి, బాధల నుంచి విముక్తి కల్గిస్తుందని రోగాలను తగ్గిస్తుందని, లైంగిక పటుత్వాన్ని పెంచుతుందని, తనంతట తానే ఒక భ్రమను కల్పించు కోవడం.
సామాజికంగా సత్సంబంధాలను నెలకొల్పుకోడానికి తగిన మనస్థైర్యంలేని వాళ్లు దాన్ని కప్పిపుచ్చుకుంటూ సామాజికంగా ఆమోదం పొందాలని పడే తాపత్రయం.

ఇతర కారణాలు
స్వతంత్ర భావాలను వ్యక్తం చేయడం, విద్వేషాన్ని తీర్చుకోవడం, ఆనందాన్ని అనుభవించానుకోవడం, థ్రిల్లింగ్ కోసం, సాహస కృత్యం చేస్తున్నామనే ఉత్కంఠకు లోనవటం, సమ వయస్కుల ప్రభావం మొదలైన వాటి వల్ల మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం జరుగుతుంది. ఉద్వేగ విచలనాలకు లోనైన వ్యక్తులు, న్యూరోటిక్ మూర్తి మత్వం కలవాళ్లు, స్కిజాయిడ్ వ్యక్తులు ఇగో శాటిస్‌ఫేక్షన్ కోసం తక్షణ మార్గాలను అన్వేషించేవాళ్లు, మానసిక సంఘర్షణ, ఒంటరితనం, సూపర్‌ఇగో బలహీనత కల్గినవాళ్లు ఎక్కువగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు. సోషియోపాతిక్, సైకోపాతిక్ వ్యక్తులు అందరిక న్నా ఎక్కువగా మత్తుపదార్థాల కు బానిసలవుతారు. వారిలో నేర ప్రవృత్తి ఎక్కువగా ప్రబలడా నికి మాదక ద్రవ్యాల వాడకం విస్తృతంగా సహకరిస్తుంది.

-పద్మా కమలాకర్