Home గాసిప్స్ మొత్తం ప్రేమను బహుమతిగా ఇస్తుందట

మొత్తం ప్రేమను బహుమతిగా ఇస్తుందట

Salman

డిసెంబర్ 27న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలకు సిద్ధపడుతుండగా… మరోవైపు బాలీవుడ్‌లో కూడా రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు ఆయన స్నేహితులు. ఇవన్నీ ఒకెత్తు అయితే… ఆరోజు సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్ అయిన రష్యన్ భామ లులియా వాంతుర్ ఇచ్చే గిఫ్ట్‌ఫై అందరికీ ఆసక్తి నెలకొంది.

ఈ సందర్భంగా పుట్టినరోజున సల్మాన్‌కు ఏ బహుమతి ఇస్తున్నారంటూ ఆమెను అడగగా… “ఆ రోజు నా మొత్తం ప్రేమను, గౌరవాన్ని సల్మాన్‌కు బహుమతిగా ఇచ్చేస్తాను”అని చెప్పింది లులియా వాంతుర్. ఆరోజు అందరం కలిసి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటామని పేర్కొంది ఈ భామ. ఇక గత కొంతకాలంగా సల్మాన్, లులియాల మధ్య రొమాన్స్ గురించి పలు వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై సల్మాన్ ఏనాడూ మాట్లాడలేదు. కానీ లులియా మాత్రం అప్పుడప్పుడూ సల్మాన్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది.