Search
Sunday 18 November 2018
  • :
  • :

జబర్దస్త్ అమ్మాయి.. అక్కినేని అబ్బాయి ప్రేమించుకుంటున్నారా..?

Rashmi-Sumanthఈటివి జబర్దస్త్ కార్యక్రమం ఎంత హిట్ అయిందో.. అందులోని యాంకర్లు కూడా సూపర్ హిట్ అయ్యారు. ఇద్దరు యాంకర్‌లు షోలో తమ అందాలను చూపిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు నిద్ర పట్టనివ్వడం లేదు.
ముఖ్యంగా రేష్మీ విషయానికొస్తే.. ఈ అమ్మడు కోసం జబర్దస్త్ చూసే వాళ్లు కోకొల్లలు అనడంతో ఆశ్చర్యం లేదు. అంతగా అభిమానుల్ని తనవైపు తిప్పుకుంది రేష్మీ. గతంలో కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసిన రేష్మీ… ఈ షో తర్వాత హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సెటిల్ అయింది. తొలి చిత్రం గుంటూర్ టాకీస్‌లోనే తన అందాల ఆరబోతతో అందరిని కట్టిపడేసింది. కాగా ఈ అమ్మడుకి వెండితెరపై పెద్దగా ఆఫర్లు లేకపోయినా.. బుల్లితెరపై మాత్రం ఫుల్ బిజీబిజీగా ఉంది.
అసలు విషయానికొస్తే రేష్మీ ఈటివిలో టెలికాస్ట్ అయ్యే ఢీ జోడి అనే షోలో టీం లీడర్‌గా వ్యవహరిస్తుంది. ఈ షోకి అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నటుడు సుమంత్ తన చిత్రం ‘నరుడా డోనరుడా’ ప్రోమోషన్స్‌కి వచ్చాడు. ఈ షోలో సుమంత్‌కు అక్కడ ఉన్న ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అంటూ టాస్క్ ఇచ్చారు. అయితే అతడు అక్కడు ఉన్న సదా, తన చిత్ర హీరోయిన్లను పక్కన పెట్టి టక్కున రేష్మీకి ప్రపోజ్ చేసి తనతో డ్యాన్స్ కూడా చేశాడు. అయితే ఇదంతా ప్రమోషన్స్‌లో భాగమని తొలుత అందరూ భావించారు.
కానీ రేష్మీ మాత్రం సుమంత్ తనను నిజంగానే ప్రేమిస్తున్నాడని ఫిక్స్ అయినట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్న సుమంత్ ఆ తర్వాత విడాకులూ తీసుకున్నాడు. దీంతో రేష్మీ తనను సుమంత్ రెండో పెళ్లి చేసుకొనున్నాడని అనుకుంటుందటా.. అసలే తనకు సినిమా అవకాశాలు కరువైన తరుణంలో అక్కినేని ఇంటికి కోడళిగా వెళ్తే తనకు తిరుగు ఉండదని భావిస్తుందని టాక్.. మరి ఇది నిజమవుతుందో…. లేదో వేచి చూడాల్సిందే..

Comments

comments