Home జిల్లాలు 26న జిల్లా పరిషత్ మైదానంలో జాబ్‌మేళా

26న జిల్లా పరిషత్ మైదానంలో జాబ్‌మేళా

Jabmela at the Zilla Parishad ground on 26th
Jabmela at the Zilla Parishad ground on 26th

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : ఈనెల 26న లోక్‌సభ పక్ష నేత, మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణం లోని జిల్లా పరిషత్ మైదానంలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు టిఆర్‌ఎస్ నాయకులు సురేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం  జన్మదిన కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడు తూ ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా జాబ్‌మేళా, పేద ప్రజలకు ఉచిత మెగా వైద్య శిభిరం, దంత చికిత్స, కంటి వైద్య చికిత్స శిబిరాలు నిర్వహించడం జరుగుతందని తెలిపా రు.ఈ  మేళాలో దాదాపు 50కి పైగా కంపెనీలు పాల్గొంటాయని పేర్కొ న్నారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఇది సువర్ణ అవకాశమని, పది, ఇం టర్, డిగ్రీ పూర్తి చేసిన  వారు తమ సర్టిఫికెట్లు, బయోడాటలతో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సంజీవరెడ్డి, గౌరవరెడ్డి,విక్రమ్‌రెడ్డి, మున్నూరు రవి, గణేష్‌ముడావత్, చంద్రకాంత్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.