Home స్కోర్ నేడు జడేజా నిశ్చితార్థం

నేడు జడేజా నిశ్చితార్థం

Jadeja-22రాజ్‌కోట్: టీమిండియా స్పిన్ ఆల్‌రౌం డర్ రవీం ద్ర జడేజా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. రాజ్‌కోట్‌కు చెందిన రీవా సోలాంకితో జడేజా త్వరలో ఏడు అడుగులు వేయనున్నాడు. ఈ మేరకు జడేజా-సోలాంకిల నిశ్చితార్థం నేడు జరుగుతున్నట్లు అతని సొదరి నైనా జడేజా వెల్లడించారు. గతేడాది టీమిండియా ఆటగాళ్లు రోహిత్, రైనా, ఉతప్ప, హర్భజన్ సింగ్ తమ బ్యాచ్‌లర్ జీవితా నికి స్వస్థి పలకగా, తాజాగా జడేజా వారి సరసన చేరబోతున్నాడు.