Search
Sunday 18 November 2018
  • :
  • :

నాలుగేళ్ల పాలన సంతృప్తికరం: మంత్రి జగదీశ్‌రెడ్డి

Jagadeesh Reddy Speech About Telangna Devlopment
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యతనిచ్చినందుకు సంతృప్తికరంగా ఉందని రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర నాలుగవ ఆవిర్భావ వేడుకలు సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఇరవై శాతం వృద్ధిరేటు సాధించి ప్రగతి పథంలో దూసుకుపోతున్న ఏకైక రాష్ట్రంగా అందించారన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం దేశం మొత్తం తన వైపుకు చూసేలా ముఖ్యమంత్రి దీక్ష దక్షతకు అద్దం పడుతుందన్నారు. ఆసరా పింఛన్లు, ఆయా కుల వృత్తుల సంక్షేమానికి భరోసానిస్తూ ముందుకు సాగుతుందన్నారు. 60 ఏండ్లుగా చితికిపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునర్జీవం పోశారన్నారు. ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలు పేదల జీవితాలలో వెలుగులు నింపాయన్నారు. రైతులకు రుణమాపీతో సంతృప్తి చెందని ముఖ్యమంత్రి వ్యవసాయ యాంత్రీకరణ ఎరువులు విత్తనాలు, రైతులకు అందుబాటులో ఉంచడంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత, ఇరిగేషన్ ప్రాజెక్టుల వేగవంతం భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకాలతో రైతు దశ మారుతుందన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండగనుకున్న వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ పండగ చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో ప్రతీ ఒక్కరు పాల్గొని సంతోషాన్ని పంచుకోవాలన్నారు.
2017 18లో రాష్ట్రం 20 శాతం వృద్ధిరేటు
తెలంగాణ రాష్ట్రం 20 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే అగ్రగామీగా నిలిచిందని మంత్రి స్పష్టం చేశారు. గత నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న విధి, విధానాలు సత్ఫలితాన్నిచ్చాయని వెల్లడించారు. సంక్షేమంతో పాటు అభివృద్దిలోనూ రాష్ట్రం ముందడుగులో ఉండడం సంతోషదాయకమన్నారు. విద్యుత్తు కొరత రాష్ట్రానికి సవాలుగా మారినప్పటికీ దానికి సమర్ధవంతంగా అధిగమించినందుకు సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర ప్రజలు కృతజ్ఞతీయులన్నారు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో 860 గ్రామీణ ఆవాసాలతో పాటు మూడు మున్సిపాలిటీ పరిధిలో రూ. 754 కోట్ల అంచనా వ్యయంతో మంచినీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రైతు బంధు అమలు నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా జిల్లాలోని 23 మండలాలలో 279 రెవిన్యూ గ్రామాలలో వంద రోజుల పాటు చేసిన సర్వేలు భూ యజమానులకు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. జిల్లాలోని 8 లక్షల 86 వేల 80 ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది లక్షల 41 వేల 865 ఎకరాలలో 90 శాతం వివాదరహితమైన భూములను ప్రభుత్వం గుర్తించిందన్నారు. జిల్లాలోని చిన్న, సన్న కారు రైతులకు 50 శాతం రాయితీపై 175లో ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం రాయితీపై 24 ట్రాక్టర్లు అందంచడం జరిగిందన్నారు. రైతు బంధు పథకం ద్వారా జిల్లాలో రెండు లక్షల 34 వేల 913 మంది రైతులకు రూ. 231.84 కోట్లను రెండు లక్షల 37 వేల 326 చెక్కుల ద్వారా అందించడం జరిగిందన్నారు. జనవరి ఒకటి 2018 నుండి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం జిల్లాలో నాలుగు లక్షల 16 వేల 423 కనెక్షన్లలో ఒక లక్ష 21 వేల 121 మంది వ్యవసాయ రైతులు లబ్ధిపొందుతున్నారన్నారు. అలాగే వంద కోట్ల రూపాయలతో చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్‌లో 400/200/132 కెవితో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన 1254 చెరువులను పునరుద్దరణ పేరుతో ఆయకట్టుగా ప్రాణం పోసుకుంటున్నాయని అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా జిల్లాలో ఎస్సీలకు 847, ఎస్టీలు 740, బిసి, ఈబిసీలు 1782, మైనారిటీలు 198 మొత్తం కలిపి 3587 మందికి రూ. 22 కోట్ల 84 లక్షల 43 వేల 982 రూపాయలు అందించారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్‌తో పాటు అమ్మ ఒడి పథకం ద్వారా 9947 మందికి రూ. ఏడు కోట్ల వెయ్యి రూపాయలు అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని 22 పిహెచ్‌సీలలో వంద శాతం ప్రసవాలు జరిగి రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో నిలిచిందన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు 22 గురుకుల పాఠశాలలు, 18 కస్తూర్బా గాంధీ, 9 మోడల్ స్కూళ్లు, 36 భావన కేంద్రాల ద్వారా రూ. లక్ష 39 వేల 942 మందికి విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. వీటితో పాటు ఆసరా పెన్షన్, మత్స శాఖ, పశుసంవర్ధక శాఖ, రెండు పడక గదుల ఇండ్లు, మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్, రహదారులు భవనాల శాఖ, మున్సిపాలిటీ, హరితహారం, పౌర సరఫరాలు, పరిశ్రమలు, ఎక్సైజ్ తదితర అంశాలలో పూర్తి సత్ఫలితాలను జిల్లా పొందుతుందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎస్పీ ప్రకాశ్‌జాదవ్, జాయింట్ కలెక్టర్ డి.సంజీవరెడ్డి, పిడి కిరణ్‌కుమార్, డిఈఓ చైతన్య జైనీ, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి పూలమాల వేశారు. అనంతరం కోలాట బృందంచే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు భారీ సంఖ్యలో హాజరై కళాశాలలో జరిగిన వివిధ నృత్య కళాకారుల ప్రదర్శనలు మంత్రి తిలకించారు.

Comments

comments