Search
Wednesday 18 July 2018
  • :
  • :

నలు దిశలా తెలంగాణ ఘనత

Jagadeesh Reddy Speech ABout TS State Devlopments

మన తెలంగాణ/ సూర్యాపేట : ప్రపంచ దేశాలకు తెలంగాణ అనే పదాన్ని పరిచయడం చేసిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని విద్యుత్, ఎస్‌సి కులాల అభి వృద్ది శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లే అయినా సిఎం పరిపాలనా దక్షతతో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం 28రాష్ట్రాలకు రోల్‌మో డల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరు గుతున్న ఉత్సవాల్లో పాల్గొనేందుకు గాను ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. హ్యూ స్టన్‌లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న అనం తరం ఆయన నార్త్ కరోలినా లోని చార్లెట్ వద్ద చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ అధ్వ ర్యంలో జరిగిన వన భోజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రవాసులతో కలిసి ఆయన చేపల వేటలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా చార్లెట్ తెలం గాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 17శాతం గ్రోత్ తో ప్రగతిపథాన దూసుకపోతుందని వివరిం చారు. రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే ఇంతటి అభివృద్ధికి సీఎం పడుతున్న శ్రమ ఒక్కటే కారణమని స్పష్టం చేశారు. రేపటి తెలంగాణ రాష్ట్రాన్ని సశ్యస్యామలం చేయ నున్న కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ముఖ్య మంత్రి కేసీఆర్ స్వీయ సారధ్యంలోనే నిర్మాణం జరుగుతుందన్నారు. ఆయనే ఒక ఇంజనీర్‌గా మారి కాళేశ్వరం వంటి అత్యద్బుతమైన ప్రాజెక్టుకు రూప కల్పన చేసిన మహాశిల్పి కేసీఆర్ అని కొనయాడారు.

ప్రతి రోజు యావత్ భారత దేశంలోని 28రాష్ట్రాల నుంచి తెలంగాణలో జరుగు తున్న అభివృద్దిని అధ్యయనం చేయడంతో పాటు వారి రాష్ట్రాల్లో అమ లుపర్చేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శిస్తున్న ప్రతినిధి బృందాల పర్యటనలే ఇందుకు అద్దంపడుతున్నా యన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి మహాత్తరమైన పథకాలను యావత్ భారత దేశం మార్గదర్శకంగా ఎంచుకున్న విషయాన్ని ప్రవాసులు విస్మరించరాదని కోరారు. ప్రస్తుతం యావత్ ప్రపంచానికి తెలంగాన సంస్కృతి, సంప్రదాయాలు ఒక దిక్సూచిగా మారాయని చెప్పారు. మూడున్నర వేల జాతుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదా యానికి ప్రత్యేక స్థానం ఉందని మంత్రి తెలిపారు. ఎవరికి లేని బతుకమ్మ మన సొంతం అయినందుకు గర్వపడాలని ప్రవాసాంద్రులకు ఉద్బోదించారు. అమెరికాలోని తెలంగాన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుతున్న తెలంగాణ బిడ్డలు అభినందనీయులని కొనియాడారు. తెలంగాన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలకు ఎన్‌ఆర్ ఐలు తోడ్పాటు నందించాలని ఆయన ప్రవాస తెలంగాణ సంఘాలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మారుతున్న ప్రపంచా నికి అనుగుణంగా వృత్తులు మారు తున్నాయని తదననుగుణంగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రవాసులు ముందుకు రావాలని మంత్రి కోరారు.ఈ కార్యక్రమంలో రమణ కొట్టే తదితర చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.

Comments

comments