Home ఆంధ్రప్రదేశ్ వార్తలు వైసిపి శాసనసభా పక్ష నేతగా జగన్‌

వైసిపి శాసనసభా పక్ష నేతగా జగన్‌

Jaganఅమరావతి: వైసిపి శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది.   ఈ సమావేశానికి వైకాపా ఎంఎల్ఎలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. శాసనసభాపక్ష నేతగా జగన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తీర్మాన ప్రతిని శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించనున్నారు. ఎంఎల్ఎ బృందంతో కలిసి వెళ్లి జగన్‌ గవర్నర్‌కు ఈ ప్రతిని అందజేస్తారని పార్టీ నేతలు తెలిపారు. శనివారం ఉదయం పార్టీ కార్యాలయం వద్ద వైసిపి శ్రేణులు సందడి చేశాయి. ఈనెల 30న జగన్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని, జూన్ లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మే 30న జరిగే కార్యక్రమంలో జగన్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్టేడియంలో 50 వేల మందికి పైగా కూర్చునేందుకు వీలు ఉంది. దీంతో ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియాన్ని జగన్ ప్రమాణ స్వీకార వేదికగా నిర్ణయించి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Jagan Elect as YCP Legislative Assembly Leader