Home జాతీయ వార్తలు జగన్ యాత్రకు అనుమతి నిరాకరణ…

జగన్ యాత్రకు అనుమతి నిరాకరణ…

JAGAN
తూర్పగోదావరి : వైసిపి అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జిపై పాదయాత్రకు పూనుకున్నారు. కానీ ఆయనకు అనుమతి లభించలేదు. పాదయాత్రకు మరో దారి చూసుకోవాలని సూచిస్తూ వైసిపి ప్రతినిధులకు రాజమండ్రి డిఎస్సి ఓ లేఖ రాశారు. వంతెన పరిస్థితి సరిగా లేనందునే పాదయాత్రకు అనుమతించడం లేదని డిఎస్సి ఆ లేఖ లో స్పష్టం  చేశారు. ప్రస్తుతం జగన్ ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది. శనివారం ఉదయం నిడదవోలు నియోజకవర్గంలోని పెరవాలి నుంచి తన పాదయాత్రను జగన్ ప్రారంభించారు. నిడదవోలులో జరిగే భారీ బహిరంగ సభలో వైసిపి నేత జగన్ మాట్లాడనున్నారు.