Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

జగ్గారెడ్డి దీక్షాయత్నం భగ్నం

మల్లన్నసాగర్‌కు వెళ్తుండగా ఉద్రిక్తత నడుమ అరెస్ట్

jagga-Reddyసంగారెడ్డి/ హైదరా బాద్: మెదక్ జిల్లా కేంద్రమైన సంగా రెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతి నిధి, మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డిని పోలీ సులు అరెస్ట్ చేశారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు 2013 చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని డి మాండ్ చేస్తూ బుధవారం నాడు సంగారెడ్డి  పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు తన ఇంటి నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి పాద యాత్రగా బయలుదేరారు. ఇంటి నుంచి వచ్చిన వెంటనే స్థానిక డిఎస్‌పి తిరుపతన్న, పోలీసులు ఆయన్ని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసులను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. జగ్గారెడ్డితో పాటు కొంత మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు పట్టణంలో హైడ్రామా జరిగింది. ఆమరణ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం, తాను దీక్ష జరిపి తీరుతానని జగ్గారెడ్డి ప్రకటించడంతో పోలీసులు బుధవారం ఉదయం ఆ ర్‌అండ్‌బి వద్ద, కలెక్టరేట్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐబికి తా ళాలు వేశారు. జగ్గారెడ్డి హైదరాబాద్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామో దర్ రాజనర్సింహాతో కలిసి సంగారెడ్డికి వస్తున్నాడని, ఆయన కలెక్టరేట్ వద్ద గానీ, మరోచోట గానీ దీక్ష చేసే అవకాశం వుందనే సమాచారం పోలీ సులకు అందడంతో పోలీసులు పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వరకు నిఘా ఏర్పాటు చేశారు. ఆయన ఎక్కడి నుంచి వస్తారో కనుక్కొని పట్టణంలోకి ప్రవేశించడానికి ముందే అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి కాకుండా జగ్గారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని తన ఇంటి నుంచి పాదయాత్రగా బయలుదేరి పోలీస్‌స్టేషన్ దరిదాపులోకి రాగానే సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న, ఇతర పోలీసులు పట్టణ పోలీ స్‌స్టేషన్ వద్దనే అడ్డుకొని అరెస్ట్ చేశారు. జగ్గారెడ్డిని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వుంచితే సమస్య వస్తుందని ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జగ్గారెడ్డి అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం దామోదర్ రాజనర్సింహాలు ఇంద్రకరణ్ పోలీ స్‌స్టేషన్‌కు చేరుకొని జగ్గారెడ్డికి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తుందని విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణలో 2013 చట్టం ప్రకారమే రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగ్గారెడ్డి అరెస్టును ఖండించిన పిసిసి
మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఆమరణ దీక్ష సిద్ధపడిన మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డిని అరెస్టు చేయడాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఖండించింది. ప్రజాస్వామ్య బద్దంగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే యత్నాలను అడ్డుకోవడం నిరంకుశ విధానాలకు అద్దం పడుతోందని పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. జగ్గారెడ్డిని అరెస్టు చేయడాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ, ఆ గ్రామాలకు ప్రజాప్రతినిధులను కూడా అనుమతించకపోవడాన్ని వారు ఆక్షేపించారు.

Comments

comments