Search
Sunday 23 September 2018
  • :
  • :

జంగంపల్లి జంటహత్యలు భయాందోళన

 Jaggampally twin killings

మన తెలంగాణ/కామారెడ్డి:  బిక్కనూర్ మండలం జంగంపల్లిలో బుధవారం జరిగిన జంట హత్యల సంఘటన సంచలనం రేపింది. జంగంపల్లి విడిసి అధ్యక్షుడు రమేష్, కోశాధికారి రాము లను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ జంట హత్యలు కామారెడ్డి ప్రాంతంలో సంచలనాలు రేపాయి. హత్యలకు కారణాలను వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసును ఛేదించడానికి జాగిలాలతో, క్లూస్‌టీమ్, వివిధ ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విడిసి చైర్మెన్ లక్షంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో మద్యం సీసాలు ఉండడం అర్ద్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడడం తెలిసిన వారే హత్యలకు పాల్పడి ఉంటారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గ్రామంలో..సంచలనం రేపిన గతంలో 4 హత్యలు జరిగాయి. ఈ జంటహత్యలతో జంగంపల్లిలో భయాందోళనలురేగుతున్నాయి. లోగడ జంగంపల్లి గ్రామంలో ఇంజనీరింగ్ విద్యార్థిని స్మార్ట్ ఫోన్ కోసం హత్య చేశారు. నగల కోసం, డబ్బు కోసం పోలం వద్ద ఉన్న మహిళను దారుణంగా చంపారు. ఆస్తి తగాదాల్లో పలు నేరాలు జరిగాయి. బుదవారం జరిగిన జంట హత్యలలో నమ్మించి దారుణానికి పాలుపడినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. జంట హత్య బాదిత కుటుంబాలను శాసనమండలి విపక్ష నేత షబ్బిర్ అలి పరామార్శించారు. హంతకులను వేంటనే ఆరెస్టు చేయాలని పోలిసులను డిమాండు చేశారు. జంటహత్యలకు రాజకీయ కక్షలు కారణం కావచ్చని పోలిసు వర్గాలు అనుమానిస్తున్నాయి. విడిసి చైర్‌మెన్ రమేష్ త్వరలో జరుగనున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటి చేస్తానని ప్రచారం చేసుకున్నారని బందువులు తెలిపారు. హత్య స్థలంలో మం దు బాటిల్ ఉండడం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలో హత్య కేసును చెదిస్తామని భిక్కనూరు పోలిసులు ప్రకటించారు.

Comments

comments