Home సంగారెడ్డి ఉనికి కోసమే జగ్గారెడ్డి ఉబలాటం

ఉనికి కోసమే జగ్గారెడ్డి ఉబలాటం

croud
*ప్రజలు జగ్గారెడ్డిని ఏనాడో మరిచిపోయారు

*పేద ప్రజల భూములు లాక్కున్న చరిత్ర జగ్గారెడ్డిదే
*సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డిల ఆరోపణ

మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : ప్రజలు మాజీ ఎమ్మె ల్యే జగ్గారెడ్డిని ఏనాడో మరిచిపోయారని ఉనికి కోసమే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తు అవగాహన హా మీలను ఇస్తూ పత్రికా ప్రకటనలకే పరిమితమ య్యారని టీఆర్‌ఎస్ నాయకులు సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డిలు ఆరోపిం చారు. బుధవారం జడ్‌పి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమా వేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను గెలిస్తే 30వేల ఇండ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చిన జగ్గా రెడ్డి వాటి నిర్మాణానికి ఎన్ని నిధులు ఖర్చవుతాయో ఒక్కసారి అవగాహన చేసుకోవాల న్నారు. నిర్మించి ఇవ్వకుండా రాజీనామాలంటూ సవాళ్లు విసరడం, వాటిపై నిలబడకపోవడం ఆయనకు అలవాటేనన్నారు. గతంలో తెలంగాణ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన జగ్గారెడ్డి, తెలంగాణ వచ్చాక మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి లక్ష మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసమని ఇలా అనేక సార్లు అనేక సవాళ్లు విసిరి ఒక్కమాటపై కూడా నిలబడకుండా పూటకో పార్టీని మార్చి ప్రజలను ఏమార్చాలనుకుంటే ప్రజలు గమనిస్తున్నారని, విజ్ఞులైన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఏనాడో జగ్గారెడ్డిని ప్రక్కన బెట్టారని మళ్లీ ఇపుడు కొత్తగా 30వేల ఇండ్లు అంటూ బయలుదేరి కట్టివ్వకపోతే రాజీనామా అంటూ కొత్త సవాళ్లకు వస్తున్నారని ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుంటుందన్నారు. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క ఇల్లు నిర్మించకుండా అనునాయిలకు సర్టిఫికేట్లు ఇస్తే అమ్ముకున్న సంగతి మర్చిపోయావా అన్నారు. ప్రతి ఊరిలో పేద ప్రజల భూ ములు కబ్జాలు చేసి వారిని మబ్బెపెట్టి బీర్‌ఫ్యాక్టరీలకు దారాదత్తం చేసిన ఘనత జగ్గారెడ్డిదేనన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకుంటానని బయలు దేరి శవాలపై రాజ కీయాలు చేస్తూ పూర్తిగా దిగజారీపోయారన్నా రు. పదేళ్ల తనపాలనలో ఏ రైతును ప్ర జానికాన్ని కలవని జగ్గారెడ్డి ఇప్పుడు తననెక్కడ గుర్తించరోననే భయంతో పత్రికలో ప్రకట నలు ఇస్తూ శవరాజకీయాలకు తెరలేపుతున్నారన్నా రు. టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం కృషిచేస్తున్నారని, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం కూడా కొనసాగుతుందని, డబ్బుతో ప్రజ లను కొనాలనుకునే ఆలోచన మానుకోవాలని ఏనాడో ఓటుతో జగ్గారెడ్డికి బుద్దిచెప్పిన మర్చిపోయి మళ్లి అదే బాటలో నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జడ్‌పిటిసి మనోహర్‌గౌడ్, టీ ఆర్‌ఎస్ నాయకులు కొండల్‌రెడ్డి, ప్రభా కర్, అశోక్, రాంరెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సింలు, హరికిషన్, చక్రపాణి, ఎంపిపీ విఠల్, రాజేందర్‌నా యక్, మోహన్‌నాయక్, రవి,కిరణ్, ఆత్మక మిటీ డైరెక్టర్ బొ బ్బలి రాజు ఉన్నారు.