Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రెండో రోజు కొనసాగిన జగ్గారెడ్డి దీక్ష

Jaggareddi Riley fasting is the second day
మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డికి మెడికల్ కళాశాలను మంజూరుచేయాలంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తలపెట్టిన రిలే నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగింది. ఈ దీక్షా ప్రాంగణానికి జహీరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి హాజరై జగ్గారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 67 సంవత్సరాలుగా జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డిని కాదని ఇటీవలే ఏర్పడ్డ సిద్దిపేటకు మెడికల్ కళాశాల మంజూరు కావడం ఎంత వరకు సమంజసమన్నారు. సిద్దిపేటకు ఇస్తే తమకు అభ్యంతరం లేదని అవసరమైన సంగారెడ్డికి వెంటనే మెడికల్ కళాశాల ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టకుండా కేవలం రాజకీయాలకే పరిమితమైందన్నారు. జగ్గారెడ్డి తలపెట్టిన ఈ మూడు రోజుల దీక్షకు వివిధ సంఘాల నాయకులు సైతం మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, జెడ్పీటిసి సంగమేశ్వర్, రైతు సంఘం నాయకులు రామక్రిష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్న శంకర్‌రెడ్డి, టిజెఆర్ యువసేన అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్‌సాబేర్, ఆంజనేయులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments