Home తాజా వార్తలు జగ్గారెడ్డి బ్రేస్‌లెట్‌కు రూ.20లక్షలు

జగ్గారెడ్డి బ్రేస్‌లెట్‌కు రూ.20లక్షలు

BROSSLET

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి ఆ పార్టీ అగ్రనేత, ఎంపి వి.హన్మంతరావు బహుకరించిన బ్రేస్‌లెట్‌కు రూ.20లక్షల ధర పలికింది. ఈ నెల ఒకటో తేదీన సంగారెడ్డిలో కాంగ్రెస్ సభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా వి.హన్మంతరావు సభ కోసం జగ్గారెడ్డి చాలా కష్టపడ్డారని, ఎంతో ఖర్చు చేశారని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాహుల్ మరి మీరేమీ ఇచ్చారని హన్మంతరావును సరదాగా అడిగారు. ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదని హన్మంతరావు రాహుల్‌కు చెప్పారు. అప్పుడు రాహుల్ హన్మంతరావు చేతికి ఉన్న బ్రేస్‌లెట్‌ను చూపించారు. దీంతో హన్మంతరావు ఆ బ్రేస్‌లెట్‌ను జగ్గారెడ్డికి బహుకరించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. అయితే ఈ బ్రేస్‌లెట్‌ను శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో వేలం వేశారు. ఈ వేలంలో బ్రేస్‌లెట్‌ను కృషి డెవలపర్స్ భవన నిర్మాణ సంస్థ రూ.20లక్షలకు సొంతం చేసుకుంది. ఈ మొత్తాన్ని ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన మిర్చి రైతులకు అందిస్తానని జగ్గారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.