Search
Thursday 15 November 2018
  • :
  • :

కొండెక్కిన బెల్లం ధర..!

Jaggery

వనపర్తి: గత కొన్నిరోజలుగా బెల్లంపై ప్రభుత్వం నిషేధం విధించింది. సంక్రాం తి పండుగను దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ అదికా రులు బెల్లం విక్రయాలకు మళ్లీ అనుమతి ఇవ్వడం తో ఇదే అదునుగా భావించినా వ్యాపారులు సిండి కేట్‌గా ఏర్పడి పండుగ సందర్బాన్ని క్యాష్ చేసు కుంటున్నారు. రూ 40 నుండి 50 వరకు కిలో బెల్లం ధర  మార్కెట్ లో ఉండగా వ్యాపారులు మాత్రం రూ 60కి కిలో బెల్లం ప్రజలకు అంటగడు తున్నారు. దీంతో  పండుగకు బెల్లం దొరికిందే ఎక్కువ అన్నా ఆలోచనతో ప్రజలు ఎగబడి కొను గోలు చేస్తున్నారు .

జనం ముందు తూకాలు వేయ కుండా ముందుగానే ప్యాక్ చేసిన 2 కేజీల బెల్లం ప్యాకెట్‌ను జనాలకు ఇస్తున్నారు. ఎక్సైజ్ అదికారు ల పర్యవేక్షణ లేక పోవడం వల్ల కింత మంది వ్యాపార్థులస్తులే  ఇతరుల ఆధార్ కార్డులను సేక రించి బెల్లం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని ఆరో పణలు ఉన్నాయి. ఇక్కడే రూ 60 కేజి బెల్లం ఇస్తే గ్రామాలల్లోని కిరాణ దుకాణాల్లో రూ 80 నుండి 100 దాకా విక్రయిస్తున్నారు. బుధవారం ఉద యం కొంత మంది తీసుకున్న బెల్లం తూకాల్లో రెం డు కిలోల ప్యాకెట్ లో 100 గ్రాములు తక్కువుగా ఉందని కొందరు వినియోగ దారులు ఆరోపిస్తు న్నారు.  తూనికల కొలతల అదికారుల పర్యవేక్షణ లేక పోవడం వలన నష్టపోతున్నట్లు వారు వాపోయారు.

Comments

comments