Home జగిత్యాల జగిత్యాల-మోర్తాడ్ రైలు ప్రారంభం

జగిత్యాల-మోర్తాడ్ రైలు ప్రారంభం

Railway1

జగిత్యాలటౌన్ : జగిత్యాల నుండి మోర్తాడ్ వరకు పొడగించిన రైలు సర్వీసును జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ గురువారం జగిత్యాల లింగంపేట రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు, కార్మిక శాఖ మంత్రి బండారి దత్తాత్రేయ, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితలు రిమోట్ వీడియో లింక్ ద్వారా రైలును ప్రారంభించగా జగిత్యాల లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి మోర్తాడ్ వరకు నడిచే రైలును జడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపెల్లి-జగిత్యాల రైల్వే లైన్ 1994లో మంజూరు కాగా దశాబ్ధాలుగా నత్తనడక నడుస్తూ వస్తుందన్నారు.

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చొరవతో ఎట్టకేలకు జగిత్యాల నుంచి మోర్తాడ్ వరకు రైలును పొడగించడం జరిగిందన్నారు. దీని ద్వారా జగిత్యాల ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా పసుపు పండించే రైతులు మామిడి రైతులు తమ పంటలను ఎగుమతి చేసుకునేందుకు వీలవుతుందన్నారు. రైల్వే లైన్ అభివృద్ధ్దితో జగిత్యాల జిల్లా వ్యాపార, వాణిజ్య పరంగా మరింత అభివృద్ధ్ది చెందుతుందని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల, మేడిపెల్లి ఎంపిపిలు గర్వందుల మానస, పల్లి జమున, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదుగంటి రవీందర్‌రెడ్డి, జిల్లా టెలికాం బోర్డు మెంబర్ సిరికొండ శ్రీనివాస్, రైల్వే అధికారులు బ్రహ్మానందరెడ్డి, వెంకటేశ్వర్‌రావు,  రఘునాథ్‌రెడ్డి, ఉమర్, శ్రీధర్‌రెడ్డి, రామారావు లతో పాటు పలువురు టిఆర్‌ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.