ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని వెస్ట్ అంధేరీలో జాగ్వార్ కారు బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేగంగా దూసుకువచ్చిన కారు సుమారు 15 వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి కారణమైన జాగ్వార్ కారు డ్రైవర్ను స్థానికులు పట్టుకుని దేశ శుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు ఆరోపించారు.