Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వినాయక చవితికి టీజర్

NTR

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ చేస్తున్న ‘జై లవ కుశ’ కూడా ఒకటి. ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడం, ఇందులో ఆయన త్రిపాత్రిభినయం చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బయటకొచ్చిన జై, లవ కుమార్ పాత్రల లుక్స్, జై పాత్ర టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా చెప్పిన తేదీ సెప్టెంబర్ 21కే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకొని శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నారు. అయితే 20 రోజుల్లో పాటలు, ప్యాచ్‌వర్క్ పనులను పూర్తిచేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియోను రిలీజ్ చేయాలని ఫిల్మ్‌మేకర్స్ భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే లవ కుమార్ పాత్ర టీజర్‌ను కూడా ఈనెల 25న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Comments

comments